ఎనిమిదో రోజూ భక్తుల పుణ్యస్నానాలు
♦ కిటకిటలాడుతున్న పుష్కరఘాట్లు
♦ {తివేణి సంగమంలో ప్రత్యేక పూజలు
♦ పోచంపాడ్‌లోనూ కొనసాగిన రద్దీ
♦ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత
♦ మంత్రి పోచారం, కలెక్టర్, ఎస్‌పీ పర్యవేక్షణ
♦ తరలివచ్చిన వీఐపీలు, వీవీఐపీలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి చాలా మంది వస్తుండడంతో పోచం పాడ్, తడపాకల్, కందకుర్తి, తుంగిని, సావె ల్, ఉమ్మెడ, గుమ్మిర్యాల్ సహా పుష్కరఘాట్ల న్నీ రద్దీగా మారాయి. పుష్కరస్నానాల అనంతరం భక్తులు దైవదర్శనాల కోసం బారులు తీరుతున్నారు. త్రివేణి సంగమానికి భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక, మహారాష్ర్ట నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ఇందుకు తగినట్లుగా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప ర్యవేక్షిస్తూ లోపాలను సవరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీ లించారు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ సుడిగాలి పర్యటనతో పుష్కరఘాట్లలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్‌పీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు.
కందకుర్తిలో అదేజోరు
కందకుర్తిలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. మం గళవారం రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంగా ప్ర సిద్ధి చెందడంతో భక్తుల సంఖ్య భారీగా పెరి గింది. నీరు కూడా సమృద్ధిగా చేరుతుండటంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉద యం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు పు ణ్యస్నానాలు చేస్తున్నారు. కందకుర్తి పుష్కర క్షేత్రానికి కిలోమీటరు దూరంలో ఎగువ భాగాన ఉన్న సంగమేశ్వరాలయం వద్ద గోదావరి నది లో నీళ్లు నిల్వ ఉండటంతో భక్తులు అధిక సం ఖ్యలో ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కందకుర్తి ని టీఎస్ ఆర్‌టీసీ జేఎండీ రమణారావు సందర్శించారు. జేసీ రవీందర్‌రెడ్డి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
వైద్య ఆరోగ్య శాఖ శిబిరా న్ని సందర్శించా రు. పోచంపాడ్‌లోనూ భక్తుల రద్దీ కొనసాగింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి తరలివచ్చారు. రెండు లక్షల వరకు గోదావరిలో పుష్కరస్నానం ఆచరించారు. వచ్చే దారి, వెళ్లే దారి ఒకటే కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
అన్ని పుష్కరఘాట్లకు తాకిడి
తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్‌లోని పుష్క ర క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున పుణ్యస్నానాలు ఆచరిస్తే బా గుంటుందనే నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తడపాకల్‌లో జనం రద్దీ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. దోంచంద, గుమ్మిర్యాల్‌కు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదారమ్మకు నీరాజనం పలి కారు. గంగమ్మతల్లి ఆశీస్సులను భక్తులు పొం దారు. బినోల ఘాట్‌లో 8120 మంది భ క్తులు పుష్కర స్నానాలు చేశారు. గ్రామాభివధ్ది కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానకార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఉమ్మెడ పుష్కర ఘాట్ లో ఎనిమిదవ రోజు పుష్కర భక్తులు తాకి డి తగ్గలేదు. వివిద ప్రాంతాల నుంచి 21 వేల మందికి పైగా భక్తులు గోదావరినదిలో పుష్కర స్నానం చేశారు. పుష్కరాల ఉత్సవాలలో భాగం గా చాకు లింగం ఆధ్వర్యంలో కళాకారులు బుర్రకథను వినిపించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక అధికారి జడ్‌పీ సీఈఓ మోహన్‌లాల్ పర్యవేక్షణ చేశారు.
పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి
ఎస్‌ఆర్‌ఎస్‌పీ పుష్కర ఘాట్ల వద్ద ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కు టుంబ స భ్యులు పుష్కర స్నానమాచరించి పుణ్య పూ జలు నిర్వహించారు. కర్నూల్ జిల్లా పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పు ణ్యస్నానాలు ఆచరించారు.తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు దంపతులు పుణ్య స్నానమాచరించారు. రాష్ట్ర గిడ్డం గుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐటీ కమిషనర్ శ్రీధర్, ఐఓసీ సీఈఓ నందకిషోర్ పవిత్ర స్నానాలు చేశారు.
మాజీ మంత్రి శనిగరం సం తోష్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. నిజా మాబాద్ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌ డ్ , మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వ ర్లు, వికారబాద్ ఎమ్మెల్యే సం జీవ్‌రావు పుష్కర స్నానమాచరించారు. దోంచంద పుష్కరఘాట్ లో మంగళవారం సినీ, టీవీ ఆర్టిస్టులు మీణా కు మారి, నందకిషోర్ పుష్కరస్నానాలు చేశారు. ఆచరిం చా రు.
జలం.. జనం
Published Wed, Jul 22 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement