Triveni Sangam
-
కుంభమేళాలో ముస్లింల మతమార్పిడి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలో పుష్కరానికి ఒకసారి జరిగే మహా కుంభమేళా వేడుకలో ముస్లింల మతమార్పిడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆలిండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ తీవ్ర ఆరోపణలు చేశారు. మహాకుంభమేళా జరిగే ప్రాంతం వైపు ముస్లింలు వెళ్లొద్దని ఇటీవల ఆదేశాలిచ్చిన బరేల్వీ తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. ‘‘ హిందూ కార్యక్రమంలో ముస్లింల మతమార్పిడి తంతు జరగబోతున్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తెస్తూ ఒక లేఖ రాశా. ఇక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్‌దే’’ అని బరేల్వీ అన్నారు. సనాతన ధర్మాన్ని పాటించే హిందువులు నడిపే దుకాణాల నుంచి పూజాసామగ్రిని కొనుగోలుచేయాలని రాబోయే భక్తులకు గతంలో అఖిలభారతీయ అఖాడ పరిషత్ పిలుపునిచ్చి తరుణంలో భిన్నమైన ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనుంది. కుంభమేళా జరిగే ప్రాంతాల్లో స్థానిక ముస్లింలు వ్యాపారాలు చేసుకోకుండా అడ్డుకోవాలని ఉద్దేశంతో కొన్ని హిందూ సంస్థలు కుట్రలు పన్నుతున్నాయని ముస్లిం, ఇతర మతాల నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆలిండియా షియా పర్సనల్ లా బోర్డ్ ప్రధాన కార్యదర్శి మౌలానా యాసూబ్ అబ్బాస్ మరోలా స్పందించారు. ‘‘ముస్లింలు కుంభమేళా పరిసరాలకు వెళ్లినా ముస్లింలకు వచ్చే నష్టమేమీలేదు. ఒక ప్రార్థనా స్థలానికి వెళ్లినంత మాత్రాన ముస్లిం వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకునేంత బలహీన స్థాయిలో ఇస్లాం లేదు’’ అని అన్నారు. -
మహా కుంభ్‌కు ఘనంగా ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ: పన్నెండేళ్లకోసారి జరిగే అతి పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహా కుంభ మేళాను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి వరకు 42 రోజుల పాటు గంగ, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరగనుంది. ఈ సందర్భంగా యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. ఇందులో జనవరి 13న పుష్య పౌర్ణమిన, 14న మకర సంక్రాంతి, 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న వసంత పంచమి, ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజు చేసే స్నానాలకు ఓ ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ స్నానం రోజుల్లో భక్తుల సంఖ్య కోట్లలో ఉండనుందన్నది అధికారుల అంచనా. కేవలం జనవరి 29న మౌని అమావాస్య రోజున షాహి స్నాన్‌లో గరిష్టంగా 4 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతంలో 2013లో జరిగిన మహా కుంభమేళాతో పోలిస్తే ఇప్పుడు జరుగనున్న మహాకుంభమేళా మూడు రెట్లు పెద్దదని భావిస్తున్నారు. ఈ పవిత్ర స్నానాల కోసం గతంలో 12 కోట్ల మంది భక్తులు రాగా ఈసారి సుమారు 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్లుగా 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మేళా ఏర్పాట్లు విస్తృతంగా సాగుతున్నాయి. నాలుగు రెట్ట బడ్జెట్ మహాకుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. గతం కంటే బడ్జెట్ నాలుగు రెట్లు పెంచారు. ఈసారి మహాకుంభ బడ్జెట్ రూ.5,060 కోట్లు కాగా ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ.2,100 కోట్లు ఇచి్చంది. 2013 కుంభ్ సమయంలో రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధికారంలో ఉండగా.. అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2013లో మహాకుంభ్‌మేళా కోసం రూ.1,214 కోట్ల బడ్జెట్ కేటాయించగా రూ.1,017 కోట్లు ఖర్చు చేశారు. 2025లో మహాకుంభ బడ్జెట్ 2013 కంటే రూ.4,043 కోట్లు ఎక్కువ కావడం విశేషం. 38 వేల మంది జవాన్లతో భద్రత మహాకుంభమేళా జరుగుతున్న కుంభ్ నగర్ భద్రతను దుర్భేద్యమైన కోటలా పటిష్టం చేశారు. కుంభ్ నగర్ మాస్టర్ ప్లాన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రత కోసం 38 వేల మంది సైనికులను మోహరిస్తున్నారు. మొత్తం 56 పోలీస్ స్టేషన్లు, 144 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రెండు సైబర్ స్టేషన్లను విడివిడిగా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో సైబర్ డెస్క్ ఉంటుంది. కాగా, 2013 మహా కుంభ్‌లో దాదాపు 12 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. వీరిలో 12 మంది ఏఎస్పీ, 30 మంది సీఓలు, 409 మంది ఇన్స్పెక్టర్లు, 4,913 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీఐపీల కోసం మహారాజా టెంట్లు వీఐపీల కోసం 150 మహారాజా టెంట్లతో కూడిన ప్రత్యేక నగరాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ఒక్కరోజు ఛార్జీ రూ.30 వేలకు పైగా ఉంటుంది. వీటితో పాటు 1,500 సింగిల్ రూమ్‌లు, 400 ఫ్యామిలీ టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు డోమ్ సిటీని సిద్ధం చేశారు. వీటి అద్దె లక్షకు పైగా ఉంటుంది. మహాకుంభ్‌లో లక్షన్నర మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 300 మొబైల్ టాయిలెట్లు ఉన్నాయి. 2013లో మొత్తం 33,903 మరుగుదొడ్లు నిర్మించారు. ఘాట్ వద్ద దాదాపు 10 వేల దుస్తులు మార్చుకునే గదులను నిర్మించనున్నారు. 2013 కుంభ్‌లో దుస్తులు మార్చుకునే గదుల సంఖ్య దాదాపు రెండున్నర వేలుగా ఉన్నాయి. 23 నగరాల నుంచి విమానాలు మహాకుంభమేళా కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను నడుపనుంది. ఇది 13 వేలకు పైగా ట్రిప్పులను నడుపనుంది. ప్రతిరోజూ 5 లక్షల మంది ప్రయాణికులు జనరల్ కోచ్‌లలో ప్రయాణిస్తారని రైల్వేశాఖ అంచనా వేసింది. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌తో పాటు నగరంలోని 8 రైల్వే స్టేషన్లను సిద్ధం చేశారు. అంతేగాక ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్ వేలకు పైగా బస్సులను ప్రత్యేకంగా నడుపనుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం నుంచి దేశంలోని దాదాపు 23 నగరాలకు నేరుగా విమానాలు అందుబాటులో ఉంచనున్నారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, భువనేశ్వర్, లక్నో, రాయ్‌పూర్, బెంగళూరు, అహ్మదాబాద్, గౌహతి, కోల్‌కతాలకు నేరుగా విమానాలు నడుస్తాయి. వీటితో పాటు మహాకుంభ్‌కు వీవీఐపీలు, విదేశీ అతిథులకు చెందిన 200కు పైగా చార్టర్డ్ విమానాలు ప్రయాగ్‌రాజ్ రానున్నాయి. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో కేవలం 15 విమానాలకు మాత్రమే పార్కింగ్ స్థలం ఉంది. అందువల్ల, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నాలుగు రాష్ట్రా ల్లోని 11 విమానాశ్రయాల నుంచి పార్కింగ్‌కు సంబంధించిన నివేదికలను అందించాల ని కోరింది. నీటి అడుగునా నిఘాం మహాకుంభ్ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈసారి విద్యుత్‌కు రూ.391.04 కోట్ల బడ్జెట్ కేటాయించారు. మొత్తం 67 వేల వీధి దీపాలను ఏర్పాటు చేశారు. 85 కొత్త తాత్కాలిక పవర్ ప్లాంట్లు, 170 సబ్ స్టేషన్లు నిర్మించారు. మహాకుంభ్‌లో ఆకాశంతో పాటు డ్రోన్ల ద్వారా నీటి అడుగున కూడా నిఘా ఉండనుంది. నీటి అడుగున భద్రత కోసం తొలిసారిగా నదిలోపల 8 కిలోమీటర్ల మేర డీప్ బారికేడింగ్‌ను ఏర్పాటు చేశారు. మహాకుంభ్‌లో అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 25 మెగా ఈవెంట్లు జరగనున్నాయి. దీనిని విదేశీ కంపెనీలు రూపొందించాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒక కార్యక్రమానికి, ప్రధాని నరేంద్ర మోదీ రెండు కార్యక్రమాలకు హాజరుకానున్నారు. పదికి పైగా దేశాల అధినేతలు రానున్నారు. -
త్రివేణీ సంగమం!
ఇప్పడీ గోష్ణ జలాలని తాగినవారు ఎలా తయారవుతారన్నది పెద్ద ప్రశ్న. గోదారి విద్వత్తు, కృష్ణా రాజకీయం సమపాళ్లలో కలసి అంటుకుంటుందా! లేక ఈ కలయికలో మరో చిత్రమైన గుణం ఆవరిస్తుందో వేచి చూడాలి. మహానదుల సంగమం! మ హత్తర సన్నివేశం! దశాబ్దాల కల! గలగలా గోదారి వచ్చి, బిరబిరా పరుగు లిడే కృష్ణమ్మను హత్తు కుంది. ఇంకేముంది, రెండు గొప్ప రుచులు, సంస్కృతులు కలసిపో యాయి- అని కొందరు అనుకుంటున్నారు. ‘‘అం తేంలేదు. ఏదో కబుర్లు’’ అంటూ చప్పరించేస్తు న్నారు కొందరు. ‘‘మళ్లించింది గోదావరిని కాదు, ప్రజల దృష్టిని’’ అన్నారు ఆంధ్రా మేధావులు. చంద్రబాబు అపర భగీరథుడన్నారు క్యాబినెట్ అను చరులు. ‘‘గోంగూర కాదూ!’’ అంటూ తేలిగ్గా తీసుకున్నారు ప్రతి పక్షులు. ఇంతకీ నిజంగా నదు ల అనుసంధానం జరిగినట్టేనా అంటే, ఎవరికి వారే ప్రశ్నార్థకంగా చూస్తున్నారు గాని పెదవి విప్పడం లేదు. కానీ, అక్కడ పెద్ద పెద్ద గొట్టాలు నిజం, గోదారి నీటిని తోడిపోస్తున్న మోటార్లు నిజం, ఆ నీటిని తెచ్చి కృష్ణలో వదులుతున్న కాలవ నిజం. ఈ ప్రక్రియని నదు ల అనుసంధానమనీ, మానవ విజయానికి పరాకాష్టనీ అంటే నాకేమీ అభ్యంతరంలేదు. పాండిచ్చేరి, యానాం వెళ్లొచ్చి కొన్ని విదేశీ పర్యటనలు కూడా చేశారన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ నడిబొడ్డున అమరావతీ మహానగర తీరాన ఒక వినూత్న ‘‘జలసంధి’’ ఏర్పడిం ది- రెండు పుణ్యనదులు ఏకీకృతమై ప్రవహించడం. గోదావరి నీళ్లకు మహత్తు ఉందనీ, ఆ నీళ్లు తాగిన వారికి విద్వత్తుకు కరువుండదనీ చెబుతారు. కృష్ణాజలాలు సేవించిన వారికి గొప్ప రాజకీయం అబ్బుతుందని పెద్ద లు చెబుతూ ఉంటారు. అందుకు ఉదాహరణలు కూడా ఇస్తుంటారు. ఇప్పడీ గోష్ణ జలాలని తాగినవారు ఎలా తయారవుతారన్నది పెద్ద ప్రశ్న. గోదారి విద్వత్తు, కృష్ణా రాజకీయం సమపాళ్లలో కలసి అంటుకుంటుందా! లేక ఈ కలయికలో మరో చిత్రమైన గుణం ఆవరిస్తుందో వేచిచూడాలి. పర్యవసానం ఎలా ఉన్నా చంద్రబాబు ఒక గొప్ప జలసంధిని రూపొందించి, ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఇదొక పుణ్యతీర్థంగా మారు తుంది. మనమే కాదు, జపాన్, సింగపూర్ వాసులు కూడా ఇక్కడకొచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ తీర్థ స్థలానికి తెలుగుదేశం నేత ఎన్టీఆర్ పేరు ఖాయం చెయ్యాలి. చంద్రబాబు ఉక్కు సంకల్పానికి దర్పణంగా, అక్కడ మహానేత ఉక్కు విగ్రహాన్ని ప్రతిష్టించాలి. నవ్యాంధ్రలో ఏ మూల నిలబడి చూసినా ఆ విగ్రహం కనిపించే పరిమాణంలో ఉండాలి. అప్పుడే ఈ విశ్వవిఖ్యాత బృహత్తర ప్రయత్నానికి సమగ్రత ఏర్పడుతుంది. యావత్ తెలుగు జాతిపక్షాన నేనీ డిమాండ్‌కు ఒడిగడుతున్నాను. పెద్దపెద్ద వాళ్లు కె.ఎల్.రావు, వి.వి.గిరి లాం టి వాళ్లు నదుల అనుసంధానం గురించి ఉత్తుత్తి కలలుగన్నారు. కానీ చంద్రబాబు క్షణాల్లో వాటిని సాకారం చేసి పడేశారు. ఎంతైనా వజ్రసంకల్పు డు. ఈ ఒరవడిని శ్రద్ధగా పాటించి మిగతా రాష్ట్రా ల వారు కూడా కాంబినేషన్లకు కృషి చేయాలి. గంగా కావేరీ, నర్మద తపతీ, బ్రహ్మపుత్ర ఇంకోటి కలుపుకుంటూ వెళ్లడమే. తలచుకుంటే పెద్ద కష్ట మేమీ కాదు. ఒక శాంపిల్ ఉంది కాబట్టి ఆ విధంగా ముందుకుపోవచ్చు. ఈయన ఇంతటితో ఆగడు. గోదావరి కృష్ణలను అనుసంధించిన బాబు గం గని కూడా దింపుతాడు. నవ్యాంధ్రలో మరో త్రివేణీ సం గమాన్ని ఆవిర్భవింపచేస్తాడని బెజవాడ కృష్ణలంక లోకల్ లీడర్ ఆవేశంగా అన్నాడు. ‘‘అదెంతపని, రేపు వచ్చేప్పుడు మోదీని నాలుగు కాశీ చెంబుల్లో గంగతీర్థం తెమ్మంటేసరి. త్రివేణి అయిపోతుంది.’’ అంటూ వ్యాఖ్యానించాడు - శ్రీరమణ, స్థానిక వామపక్షి. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
జలం.. జనం
ఎనిమిదో రోజూ భక్తుల పుణ్యస్నానాలు ♦ కిటకిటలాడుతున్న పుష్కరఘాట్లు ♦ {తివేణి సంగమంలో ప్రత్యేక పూజలు ♦ పోచంపాడ్లోనూ కొనసాగిన రద్దీ ♦ ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ కవిత ♦ మంత్రి పోచారం, కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ ♦ తరలివచ్చిన వీఐపీలు, వీవీఐపీలు సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : మహా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి చాలా మంది వస్తుండడంతో పోచం పాడ్, తడపాకల్, కందకుర్తి, తుంగిని, సావె ల్, ఉమ్మెడ, గుమ్మిర్యాల్ సహా పుష్కరఘాట్ల న్నీ రద్దీగా మారాయి. పుష్కరస్నానాల అనంతరం భక్తులు దైవదర్శనాల కోసం బారులు తీరుతున్నారు. త్రివేణి సంగమానికి భక్తుల రాకపోకలు భారీగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, క ర్ణాటక, మహారాష్ర్ట నుంచి భారీగా భక్తులు వస్తున్నారు. ఇందుకు తగినట్లుగా అధికారు లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప ర్యవేక్షిస్తూ లోపాలను సవరిస్తున్నారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి పో చారం శ్రీనివాస్‌రెడ్డి పుష్కరఘాట్లను పరిశీ లించారు. కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ సుడిగాలి పర్యటనతో పుష్కరఘాట్లలో అధికారులను అప్రమత్తం చేశారు. ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి బందోబస్తును పర్యవేక్షించారు. కందకుర్తిలో అదేజోరు కందకుర్తిలో భక్తుల సంఖ్య పెరుగుతోంది. మం గళవారం రెండు లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంగా ప్ర సిద్ధి చెందడంతో భక్తుల సంఖ్య భారీగా పెరి గింది. నీరు కూడా సమృద్ధిగా చేరుతుండటంతో భక్తుల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఉద యం తొమ్మిది గంటల నుంచి రాత్రి వరకు పు ణ్యస్నానాలు చేస్తున్నారు. కందకుర్తి పుష్కర క్షేత్రానికి కిలోమీటరు దూరంలో ఎగువ భాగాన ఉన్న సంగమేశ్వరాలయం వద్ద గోదావరి నది లో నీళ్లు నిల్వ ఉండటంతో భక్తులు అధిక సం ఖ్యలో ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. కందకుర్తి ని టీఎస్ ఆర్టీసీ జేఎండీ రమణారావు సందర్శించారు. జేసీ రవీందర్‌రెడ్డి ఘాట్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య ఆరోగ్య శాఖ శిబిరా న్ని సందర్శించా రు. పోచంపాడ్లోనూ భక్తుల రద్దీ కొనసాగింది. హైదరాబాద్, తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ నుంచి సైతం ఇక్కడికి తరలివచ్చారు. రెండు లక్షల వరకు గోదావరిలో పుష్కరస్నానం ఆచరించారు. వచ్చే దారి, వెళ్లే దారి ఒకటే కావడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రా జెక్ట్ నుంచి నీటి విడుదల జరుగుతుండటంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అన్ని పుష్కరఘాట్లకు తాకిడి తడపాకల్, దోంచంద, గుమ్మిర్యాల్‌లోని పుష్క ర క్షేత్రాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున పుణ్యస్నానాలు ఆచరిస్తే బా గుంటుందనే నమ్మకంతో భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. తడపాకల్‌లో జనం రద్దీ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. దోంచంద, గుమ్మిర్యాల్‌కు కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గోదారమ్మకు నీరాజనం పలి కారు. గంగమ్మతల్లి ఆశీస్సులను భక్తులు పొం దారు. బినోల ఘాట్‌లో 8120 మంది భ క్తులు పుష్కర స్నానాలు చేశారు. గ్రామాభివధ్ది కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత అన్నదానకార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఉమ్మెడ పుష్కర ఘాట్ లో ఎనిమిదవ రోజు పుష్కర భక్తులు తాకి డి తగ్గలేదు. వివిద ప్రాంతాల నుంచి 21 వేల మందికి పైగా భక్తులు గోదావరినదిలో పుష్కర స్నానం చేశారు. పుష్కరాల ఉత్సవాలలో భాగం గా చాకు లింగం ఆధ్వర్యంలో కళాకారులు బుర్రకథను వినిపించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక అధికారి జడ్పీ సీఈఓ మోహన్‌లాల్ పర్యవేక్షణ చేశారు. పుష్కరఘాట్లకు వీఐపీల తాకిడి ఎస్ఆర్ఎస్పీ పుష్కర ఘాట్ల వద్ద ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సభ్యులతో కలిసి పుష్కర స్నానమాచరించారు. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కు టుంబ స భ్యులు పుష్కర స్నానమాచరించి పుణ్య పూ జలు నిర్వహించారు. కర్నూల్ జిల్లా పా ణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పు ణ్యస్నానాలు ఆచరించారు.తెలంగాణ సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు దంపతులు పుణ్య స్నానమాచరించారు. రాష్ట్ర గిడ్డం గుల సంస్థ మాజీ చైర్మన్ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్, ఐటీ కమిషనర్ శ్రీధర్, ఐఓసీ సీఈఓ నందకిషోర్ పవిత్ర స్నానాలు చేశారు. మాజీ మంత్రి శనిగరం సం తోష్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించారు. నిజా మాబాద్ మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం దంపతులు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌ డ్ , మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వ ర్లు, వికారబాద్ ఎమ్మెల్యే సం జీవ్రావు పుష్కర స్నానమాచరించారు. దోంచంద పుష్కరఘాట్ లో మంగళవారం సినీ, టీవీ ఆర్టిస్టులు మీణా కు మారి, నందకిషోర్ పుష్కరస్నానాలు చేశారు. ఆచరిం చా రు. -
తులాపూర్ త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జ్జనంపై నిషేధం.
పింప్రి, న్యూస్‌లైన్: తులాపూర్ పుణ్యక్షేత్రంలోని త్రివేణి సంగమంలో అస్థికల నిమజ్జనంపై నిషేధం విధించారు. భీమా, భామా, ఇంద్రాయణీ నదుల త్రివేణి సంగమం కావడంతో మృతిచెందినవారి అస్థికలను ఇక్కడి నదీ జలాల్లో కలుపుతారు. దీనివల్ల మరణించినవారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తారు. పుణేతోపాటు ప్రింపి-చించ్వాడ్ నుంచి రోజుకు పదుల సంఖ్యలో అస్థికల నిమజ్జనం జరుగుతుందని స్థానికులు చెబుతున్నారు. కేవలం అస్థికలను మాత్రమే వేస్తే సమస్య లేదని వాటితోపాటు మరణించిన వ్యక్తిని దహనం చేసిన తర్వాత మిగిలిన బూడిదనంతా కూడా ఇక్కడికే తీసుకువచ్చి కలుపుతున్నారని, అంతేకాక మరణించిన వ్యక్తి తాలూకు దుస్తులు, పరుపులు, దుప్పట్లు, బెడ్షీట్లు వంటివి కూడా నదిలోనే వేసేస్తున్నారని, దీంతో త్రివేణి సంగమ పరిసరాలన్నీ దుర్గంధంగా మారుతున్నాయి. నదీ జలాలు కూడా పూర్తిగా కలుషితమవుతున్నాయి. పైగా తులాపూర్ గ్రామ ప్రజలు ఈ నదీ జలాలనే నిత్యావసరాలకు ఉపయోగిస్తుండడంతో వారు రోగాలబారిన పడాల్సి వస్తోంది. నీరు కలుషితం కావడంవల్ల రోగాలబారిన పడుతున్నవారి సంఖ్య ఇక్కడ బాగా పెరిగిందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే నీరు కలుషితం కాకుండా చూడడమొక్కటే మార్గమని గ్రామ పంచాయతీ తీర్మానించింది. దీంతో ఇక్కడి త్రివేణి సంగమంలో అస్థికలను నిమజ్జనం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు గ్రామ సర్పంచ్ జయశ్రీ జ్ఞానేశ్వర్ శివలే, ఉప సర్పంచ్ గణేష్ పూజారి తెలిపారు.