ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి కూడా జనం కుంభమేళాలో స్నానమాచరించేందుకు తరలివస్తున్నారు.
వివిధ దేశాల నుంచి ఇక్కడికి తరలివస్తున్న విదేశీయులు(Foreigners) ఇక్కడి సనాతన సంస్కృతితో పరిచయం పెంచుకుని, దానిని అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారు. కుంభమేళా మొదటి రోజున దాదాపు ఒక కోటి 65 లక్షల మంది భక్తులు స్నానాలు చేశారు. తొలిరోజున 20 దేశాలకు చెందిన భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
యూరోపియన్ దేశమైన బల్గేరియా నుండి పర్యాటకుల బృందం మహా కుంభమేళా(Kumbh Mela)కు తరలి వచ్చింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ బృందం జనవరి 16 వరకు ఇక్కడే ఉండనున్నారు. వీరు సనాతన ధర్మం గురించి పండితులు, స్వామీజీల నుంచి తెలుసుకోనున్నారు. ఈ బృందంలో చాలా మంది ఫోటోగ్రాఫర్లు కూడా ఉన్నారు. వారు తమ కెమెరాలతో మహా కుంభమేళాలోని పలు దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు.
వారు మన దేశానికి చెందిన ఋషులు, సాధువులు, అఖారాల సంప్రదాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విదేశీ పర్యాటకుల బృందం గంగా నదిలోని వివిధ ఘాట్‌లను సందర్శిస్తోంది. బల్గేరియా(Bulgaria)కు చెందిన టట్యానా మాట్లాడుతూ, సనాతన ధర్మం, భారతీయ సంస్కృతి గురించి తాను గతంలో విన్నానని తెలిపింది. ఈ మహా కుంభమేళా గురించి తెలియగానే దీనిలో పాల్గొనాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది.
తన స్నేహితులు కూడా మహా కుంభమేళాకు వచ్చారని టట్యానా చెప్పింది. ఇక్కడ వారు భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ మహా కుంభమేళా గురించి తాను విన్న దానికంటే ఇక్కడ అంతా భారీగా కనిపిస్తున్నదన్నారు. ఈ మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎంతో కృషిచేస్తున్నదని టటన్యా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట.. తప్పిన ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment