31 నుంచి అంత్య పుష్కరాలు
Published Sun, Jul 24 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
మంగపేట : మండలంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు ఉంటాయని తెలంగాణ బ్రాహ్మణ సంఘం మంగపేట అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి, నిర్వాహక కార్యదర్శులు గూడా వాసుదేవమూర్తి, అనిపెద్ది నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంత్య పుష్క ర పుణ్య సమయంగా భావించి మహా పుష్కర పుణ్యసమయాన పితృదేవతలకు, వారి బంధువులు, స్నేహితులు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే గోదావరిలో సంకల్ప సహిత పుణ్యస్నానాలు, పవిత్ర గోదావరి దర్శనం, దాన ధర్మాలతో కూడిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చ న్నారు.
Advertisement
Advertisement