Mangapeta
-
ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి
సాక్షి, ములుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేసవికాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి చెరువులో ఈతకి వెళ్లి, పూడిక తీసిన గుంతలోపడి ఇద్దరుబాలురు మృతిచెందారు. మృతులు మండలరేశ్వంత్ (12), ముచ్చపోతులవీరేందర్ (12)గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
మంగపేటలో వైఎస్ఆర్సీపీ రైతు పోరుబాట
-
నిధులు నీళ్లపాలు !
మంగపేట :మండల కేంద్రంలోని గోదావరి పుష్కరఘాట్ వద్ద ఏర్పడిన ఒర్రెను పూడ్చేందుకు వెచ్చించిన లక్షల రూపాయల ప్రజాధనం గోదావరి పాలయింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పుష్కరఘాట్‌కు ఎగువ ప్రాంతమైన పొదుమూరు, పంట పొలాల మీదుగా వరదనీరు ప్రవహించడంతో ఘాట్‌ను ఆనుకుని సుమారు 40 నుంచి 50 మీటర్ల వెడల్పుతో భారీ ఒర్రె ఏర్పడింది. రూ.4.22 కోట్ల పుష్కర నిధులతో నిర్మించిన ఘాట్ దెబ్బతినడంతో ‘ఘాట్‌కు పొంచి ఉన్న ముప్పు’ అనే కథనాన్ని ‘సాక్షి’ జూలై 22న వెలుగులోకి తెచ్చింది. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాన్ని ఐటీడీఏ పీఓ, మైనర్ ఇరిగేషన్ అధికారులు సందర్శించి యుద్ధప్రాతిపదికన ఒర్రెను పూడ్చే చర్యలు చేపట్టారు. ఒర్రెలో ఒండ్రు మట్టితో కూడిన ఇసుక బస్తాలను ఒడ్డు వెంట వేశారు. గోదావరి పొంగి ప్రవహిస్తే ఒడ్డుతో పాటు ఇసుక బస్తాలు సైతం కొట్టుకుపోయే ప్రమాదం ఉండటంతో గమనించిన ‘సాక్షి’ ముందుగానే ‘వరద ఉధృతికి ఇసుక బస్తాలు నిలిచేనా’ అనే కథనాన్ని ప్రచురించింది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరగడంతో ఆ తాకిడికి అన్నీ కొట్టుకుపోయాయి. ఒడ్డు వెంట రాళ్లతో కానీ, సిమెంట్ కాంక్రిట్‌తో కానీ వాల్ నిర్మించాల్సి ఉండగా, పలువురు మైనర్ ఇరిగేషన్ అధికారులు, రాజకీయ పలుకుబడి కలిగిన ఓ కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై టెండర్ నిర్వహించకుండా డిపార్ట్మెంట్ పేరుతో నాసిరకంగా పనులు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. పనుల్లో నాణ్యత లేకపోవడం వల్లే నిధులు నీళ్లపాలయ్యాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ పీఓ స్పందించి నాసిరకంగా పనులు చేసిన వారి బిల్లులు నిలిపివేయాలని, ఒడ్డువెంట కరకట్ట నిర్మించేలా చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై మైనర్ ఇరిగేషన్ డీఈఈ యశ్వంత్‌ను వివరణ కోరగా పనులు ఇంకా పూర్తి కాలేదని, ఒక్క రూపాయి బిల్లుకూడా చెల్లించలేదని అన్నారు. పని చేసినంతమేరకే బిల్లు చెల్లిస్తామని చెప్పారు. -
అంత్యపుష్కరాలు ఆరంభం
రామన్నగూడెంలో ఉత్సవ మూర్తులకు గంగస్నానం మంగపేటలో గోదావరి మాతకు హారతి ఏర్పాట్లను పట్టించుకోని అధికారులు మంగపేటలో సౌకర్యాలు లేక వెనుదిరిగిన భక్తులు ఏటూరునాగారం/మంగపేట : ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, మంగపేట మండల కేంద్రంలో అంత్యపుష్కరాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రామన్నగూడెంలో ఉదయం 6.15 గంటలకు శ్రీసీతారామ చంద్రస్వామి, ఉమారామలింగేశ్వరస్వామి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గోదావరి నదికి తీసుకొచ్చి జలాభిషేకం చేశారు. అనంతరం భక్తుల స్నానాలకు అనుమతి ఇచ్చారు. మహిళలు స్నానాలు ఆచరించి వాయినాలు ఇచ్చుకుని, నదిలో దీపాలు వదిలారు. చిల్లర డబ్బులు, పసుపు, కుంకుమ నదిలో వేసి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు పెట్టారు. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బంది పడకుండా గ్రామస్తులే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు నిర్మించారు. గోదావరి వరకు దారి ఏర్పాటు చేసి, తాగునీటి వసతి కల్పించారు. మంగపేటలోని పుష్కరఘాట్ వద్దకు సుమారు 300 మంది భక్తులు వచ్చినప్పటికీ సౌకర్యాలు లేక అందులో 100 మంది మాత్రమే స్నానం చేశారు. మిగితావారు తిరిగి వెళ్లిపోయారు. పుష్కర స్నానం ఆచరించన వారు పిండప్రదానాలు చేశారు. సాయంత్రం అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరి మాతకు హారతి ఇచ్చారు. ఎంపీడీఓ సురేష్ దంపతులతో పాటు అర్చక సమాఖ్య అధ్యక్షుడు కొయ్యడ నర్సింహమూర్తి, పూజారులు శివరామకృష్ణ, రామసుబ్బారావు, ఎం.వి.వి.సిద్ధాంతి శర్మ, ఎం.వి.ఎల్. కాంతయ్య పాల్గొన్నారు. ఏటూరునాగారం సీఐ రఘుచందర్, మంగపేట ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. శివాలయంలో పూజలు.. రామన్నగూడెం ఒడ్డున ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ఆలయంలో శివలింగానికి పంచామృతాభిషేకాలు, అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎగ్గడి కోటేశ్వర్రావు, కోశాధికారి వెనిగళ్ల శివాజీ, ప్రధాన కార్యదర్శి అల్లి శ్రీను, సర్పంచ్ బొల్లె జ్యోతి శ్రీను, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ కృష్ణ, ఆలయ పూజారులు పుల్లయ్యచారి, నర్సింహాచారి, ఆడెపు శంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
31 నుంచి అంత్య పుష్కరాలు
మంగపేట : మండలంలో ఈనెల 31 నుంచి ఆగస్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు ఉంటాయని తెలంగాణ బ్రాహ్మణ సంఘం మంగపేట అధ్యక్షుడు కొయ్యడ నర్సింహామూర్తి, నిర్వాహక కార్యదర్శులు గూడా వాసుదేవమూర్తి, అనిపెద్ది నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అంత్య పుష్క ర పుణ్య సమయంగా భావించి మహా పుష్కర పుణ్యసమయాన పితృదేవతలకు, వారి బంధువులు, స్నేహితులు పిండ ప్రధాన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చన్నారు. అలాగే గోదావరిలో సంకల్ప సహిత పుణ్యస్నానాలు, పవిత్ర గోదావరి దర్శనం, దాన ధర్మాలతో కూడిన కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చ న్నారు. -
మాడ పగులుతోంది..
గొంతు ఎండుతోంది దంచికొడుతున్న ఎండలు తారుమారైన పరిస్థితులు అక్కరకు రాని ఏర్పాట్లు ఒక ఘాట్ మూసివేత.. మరో ఘాట్‌కు బస్సులు కరువు మంగపేటలో పుణ్యస్నానాలకు కిలోమీటర్ మేర కాలినడక మహా పుష్కరాల్లో భక్తులకు తప్పని పాట్లు హన్మకొండ : జిల్లాలో గోదావరి పుష్కర ఏర్పాట్ల కోసం వివిధ ప్రభుత్వ విభాగాలు దాదాపు రూ.35 కోట్లు వ్యయం చేశాయి. మారిన పరిస్థితులతో ఇంకొన్ని నిధులు వెచ్చించాల్సి ఉన్నా సంశయంలో పడింది. ఫలితంగా నిలువ నీడలేక, తాగేందుకు మంచినీరు లభించక, చివరకు మహిళలు దుస్తులు మార్చుకునేందుకు సరిపడా సౌకర్యాలు లేక భక్తులు నానాపాట్లు పడుతున్నారు. రామ.. రామ.. రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద స్నానఘట్టాలు, దుస్తు లు మార్చుకునేందుకు షెడ్లు, బ్యాటరీ ఆఫ్ ట్యాప్స్ తదితర ఏర్పాట్ల కోసం రూ.1.4 కోట్లు ఖర్చు చేశారు. సుమారు 700 మంది సిబ్బంది భక్తుల సేవలో నిమగ్నమయ్యూరు. అరుుతే, భక్తులు పుష్కర స్నానాలు ఆచరించే ప్రాంతంలో అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి నీటి నిల్వలు ఉన్న ప్రాంతంలో భక్తులు స్నానం చేసి వస్తున్నారు. ఇలా వెళ్లే వారి కోసం ఇసుక బస్తాలతో దారి ఏర్పాటు చేశారు. నాలుగు షామియానాలు నిర్మించినా ఇతర ఏర్పాట్లేవీ చేయలేదు. వీటిలో రెండు గాలిధాటికి కూలిపోరుు రెండురోజులైనా ఎవరూ పట్టించుకోవడంలేదు. ఉదయం 10-సాయంత్రం 5గంటల వరకు సుమారు 35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు భక్తులు లేక ఖాళీగా దర్శనమిస్త్తున్నాయి. ‘ముళ్ల’కట్ట ఘాట్ రూ.4.5 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ముల్లకట్టఘాట్ భక్తుల పాలిట శాపంగా మారింది. కొత్తవంతెనపై నుంచి వాహనాల రాకపోకలు నిషేధించడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినకన వెళ్లి ఖమ్మం జిల్లాలోని అవతలివైపు గోదావరి ఒడ్డున భక్తులు పుష్కర స్నానాలు చేస్తున్నారు. పేరుకే ఖమ్మం జిల్లా అయినా.. వరంగల్ జిల్లా భక్తులే అధిక సంఖ్యలో అక్కడ పుణ్యస్నానాలు చేస్తున్నారు. అక్కడ కనీస సౌకర్యాలే చేపట్టకపోగా.. అటుగా వెళ్లొద్దంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఏర్పాట్లు ఇక్కడ.. స్నానాలు అక్కడ.. ముల్లకట్ట పుష్కరఘాట్‌కు వెళ్లొద్దని అధికారులు చెబుతు న్నా.. రామన్నగూడెం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు రద్దు చేశా రు. దీంతో భక్తులు మంగపేట పుష్కరఘాట్‌కు చేరుకుంటున్నారు. శుక్రవారం మంగపేట ఘాట్‌లో అంచనాకు మించి వచ్చిన భక్తులను తరలించేందుకు కేవలం పది మినీ బస్సు లు, మేజిక్ వాహనాలు సమకూర్చారు. వాహనాల కోసం నిరీక్షించలేక చాలామంది మూడు కిలోమీటర్ల ఎండలో కా లినడకన నదిలోకి వెళ్లి పుష్కర స్ననాలు చేశారు.