
సాక్షి, ములుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కత్తిగూడెం గ్రామంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. వేసవికాలం కావడంతో సరదాగా స్నేహితులతో కలసి చెరువులో ఈతకి వెళ్లి, పూడిక తీసిన గుంతలోపడి ఇద్దరుబాలురు మృతిచెందారు. మృతులు మండలరేశ్వంత్ (12), ముచ్చపోతులవీరేందర్ (12)గా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment