
పంట పొలాల్లో మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యం
అన్నానగర్: సెంజి సమీపంలో కురింజిప్ప గ్రామంలో శ్మశానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. మృతి చెందిన వారిని శ్మశానానికి తీసుకెళ్లేందుకు పంట పొలాల మధ్య వెళ్లాల్సి వస్తోంది. సెంజి సమీపంలో కురింజిప్ప గ్రామంలో సుమారు 1,500 మందికి పైగా ప్రజలు నివశిస్తున్నారు. ఈ ప్రాంత వాసులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు కొంతమేర కల్పించారు. అయితే శ్మశానానికి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ స్థితిలో మంగళవారం గ్రామంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శ్మశానానికి వెళ్లేందుకు దారి లేకపోవడంతో బంధువులు అతని మృతదేహాన్ని పంట పొలాల మధ్యన తీసుకెళ్లి ఖననం చేశారు. దీనిపై అధికారులు స్పందించి శ్మశానానికి వెళ్లేందుకు దారి చూపాలని స్థానికులు కోరుతున్నారు.