రోడ్డు ఓకే.. బస్సేదీ? | wanaparthy villages not having rtc bus services | Sakshi
Sakshi News home page

రోడ్డు ఓకే.. బస్సేదీ?

Published Wed, Feb 21 2018 3:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:49 PM

wanaparthy villages not having rtc bus services - Sakshi

బస్సు సౌకర్యం లేకపోవడంతో కాలినడకన బడికి వెళ్తున్న విద్యార్థులు

గోపాల్‌పేట : రవాణా వ్యవస్థ ఉన్న గ్రామాలు అభివృద్ధిలో దూసుకెళ్తాయన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిగ్రామానికి డబుల్, సింగిల్‌ రోడ్డును ఏర్పాటు చేస్తుంది. ఇందుకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తోంది. కానీ రోడ్డు ఉన్నా ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సు నడపడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామానికి మూడు రోడ్లు ఉన్నా.. 
మండలంలోని చెన్నూరుకు రెండు బీటీ రోడ్లు ఉన్నప్పటికి ఆర్టీసీ బస్సు నడవ డం లేదు.  25 ఏళ్ల నుంచి విద్యార్ధులు, గ్రామస్తులకు కాలినడక తప్పడం లేదు. 2009లో చెన్నూరు–గోపాల్‌పేటకు రూ. 57.50 లక్షలతో బీటీ వేశారు. 2007 లో చెన్నూరు నుంచి తాడిపర్తికి రూ .1.38 కోట్లతో మరో బీటీ రోడ్డు వేశా రు. అదేవిధంగా గ్రామం నుంచి అనంతగిరి చెరువు కట్టపై నుంచి వనపర్తికి వెళ్లేందుకు కూడా మూడో దారి ఉంది. కనీసం ఆటోలు  వెళ్లకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే విధంగా కేశంపేట, గొల్లపల్లి, శానాయిపల్లి, గౌరిదేవిపల్లి తదితర గ్రామాలతో పాటు కొన్ని తండాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు వెళ్లడం లేదు.  ఈ విషయమై పలుమార్లు  ఎ మ్మెల్యే చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ప్రణాళిక సం ఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని విద్యార్థులు వాపోయారు.

ఆలస్యంగా వెళ్తున్నాం 
మా ఊరికి ఆర్టీసీ బస్సు  నడపకపోవ డంతో రోజూ ఆలస్యంగా స్కూల్‌ వె ళ్తున్నాం. రానుపోను రోజుకు 10 కి.మీ. న డుస్తున్నాం.  8 గంటలకు ఇంటి నుంచి బ యలుదేరితే 9 గంటలకు స్కూల్‌కు చేరుకుంటాం సాయం త్రం 5 గంటలకు స్కూల్‌ వదిలితే ఇంటికి చేరే వరకు 6.30 అవుతుంది. బాగా అలిసిపోయి హోంవర్క్‌ చేసుకోలేకపోతున్నాము.     – హైమావతి, 9వ తరగతి విద్యార్థిని, చెన్నూరు  

కొన్నేళ్లుగా ఎదురుచేస్తున్నాం
కొన్నేళ్లుగా  మా సీనియర్లు బస్సు కోసం ఆందోళనలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగారు. అయినా బస్సు రా లేదు. మేమూ అడుగుతున్నాం. ఎం దుకోసం నడపడం లేదో చెప్పడం లేదు. ముఖ్యమైన క్లాసులకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆలస్యంగా వెళితే ఉపాధ్యాయులు మందలిస్తున్నారు. మా బాధను అర్థం చేసుకుని బస్సు నడపాలి. – శిరీష, 9వ తరగతి విద్యార్థిని, చెన్నూరు  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement