ముంబై మహానగరం అతలాకుతలం | Mumbai rains- Local train services hit, Dabbawalas suspend work | Sakshi
Sakshi News home page

ముంబై మహానగరం అతలాకుతలం

Published Tue, Jul 10 2018 10:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:30 AM

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. కేవలం 20 రోజుల్లోనే నగర సాధారణ వర్షపాతంలో 54 శాతం మేర వర్షం కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. శాంటా క్రుజ్‌ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 137 మి.మీల వర్షం కురిసిందని, రాగల 24 గంటల్లో 150 మి.మీల మేర వర్షపాతం నమోదుకావచ్చని స్కైమెట్‌ తెలిపింది. సోమవారం ముంబైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కుండపోత వర్షాల కారణంగా ఈరోజు(మంగళవారం) కూడా పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. భారీ వర్షాల కారణంగా ముంబై యూనివర్సిటీలోని అన్ని రకాల పరీక్షలను వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement