గందరగోళం మధ్య బిల్లులు.. లోక్సభ వాయిదా
పార్లమెంటు ఉభయ సభలు గందరగోళం మధ్య మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాయి. ముగ్గురు ఎంపీలు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. సభ ముందుకు వివిధ కమిటీల నివేదికలు వచ్చాయి. పోడియం వద్దే సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎంపీలు ఉన్నారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ దద్దరిల్లింది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆందోళన కొనసాగింది. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో ఎంపీలు ఆందోళన చేశారు.
అయితే, ఈ ఆందోళన మధ్యనే కేంద్ర మంత్రులు చిరంజీవి, కిశోర్ చంద్రదేవ్ లాంటి కొందరు వివిధ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు మాత్రం తెలంగాణ బిల్లు వ్యతిరేక ఆందోళనలకు దూరంగానే ఉండిపోయారు. కేవలం ఎంపీలు మాత్రమే వీటిలో పాల్గొంటున్నారు. స్పీకర్ పోడియం వద్ద చేరి నినాదాలు ఇచ్చారు. దీంతో మళ్లీ లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.