బిల్లులెందుకు ఇవ్వడంలేదు..
Published Wed, Aug 21 2013 4:11 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM
తలమడుగు, న్యూస్‌లైన్ : మరుగుదొడ్డి మంజూ రైందని చెప్పడంతో నిర్మించుకున్నామని, నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడంలేదని మండలంలోని సుంకిడి గ్రామంలో లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఎదుట ఏపీవోను నిలదీశారు. ఆర్డీవో అధ్యక్షతన సుంకిడిలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించడంలేద ని లబ్ధిదారులు ఏపీవోను నిలదీశారు. ఇలాగైతే నిర్మాణానికి ఎలా ముందుకొస్తారని ప్రశ్నించా రు. త్వరగా బిల్లులు చెల్లించేలా చూడాలని ఆర్డీవోను కోరారు. వేసవిలో చేసిన ఉపాధి హామీ పనుల కూలి డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని కొందరు కూలీలు సమస్యను సభ దృష్టికి తెచ్చారు.
దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడు తూ స్మార్ట్‌కార్డు విధానం ద్వారా చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్నవారికి సకాలం లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూలీ లకూ త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. తద్వారా మం డలాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. సభలో తహశీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో సునీత, ఏపీవో జగ్దేరావు, సర్పంచ్ గోదావరి, ఉప సర్పంచ్ దీపక్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ రమణ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ మమత, నాయకులు జీవన్‌రెడ్డి, ఆశన్నయూదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement