passage
-
‘దళారీల కొమ్ముకాస్తున్న విపక్షం’
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభలో శుక్రవారం వ్యవసాయ బిల్లులు ఆమోదాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. దళారీల నుంచి రైతులను కాపాడే ఈ సంస్కరణలను విపక్షాలు వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు. దళారీలతో పనిలేకుండా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ సంస్కరణలు వెసులుబాటు కల్పిస్తాయని చెప్పారు. వ్యవసాయంలో రైతులకు నూతన స్వాతంత్ర్యం లభించిందని ప్రధాని కోసి రైల్ మెగా బ్రిడ్జిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన అనంతరం పేర్కొన్నారు. లోక్‌సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు చేకూరుతుందని చెప్పారు. రైతులు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా విక్రయించుకునేందుకు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. ఈ బిల్లులు దళారీల నుంచి రైతులను రక్షిస్తాయని అన్నారు. ఈ అంశంపై రైతులను పక్కదారి పట్టించేందుక విపక్షాలు ప్రయత్నించాయని మండిపడ్డారు. దశాబ్ధాల తరబడి దేశాన్ని పాలించిన వారు రైతుల సాధికారత కోసం ఏమీ చేయలేదని ఆరోపించారు. రైతుల లాభాలను దోచుకునే దళారీలకు విపక్షాలు సహకరించేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. పంజాబ్ కాంగ్రెస్ ఎంపీల పార్లమెంట్ ఆవరణలోనే బిల్లు కాపీలను చించివేయగా, ఆ రాష్ట్ర రైతులు ఈనెల 24 నుంచి 26 వరకూ రైల్ రోకోకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎన్డీయే భాగస్వామ్య పక్షం శిరోమణి అకాలీదళ్‌కు చెందిన కేంద్ర మంత్రి హరిసిమ్రత్ కౌర్ బాదల్ గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చదవండి : నా పుట్టినరోజుకు ఆ గిఫ్ట్ కావాలి: మోదీ -
బిల్లులెందుకు ఇవ్వడంలేదు..
తలమడుగు, న్యూస్‌లైన్ : మరుగుదొడ్డి మంజూ రైందని చెప్పడంతో నిర్మించుకున్నామని, నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడంలేదని మండలంలోని సుంకిడి గ్రామంలో లబ్ధిదారులు నిరసన తెలిపారు. ఆర్డీవో సుధాకర్‌రెడ్డి ఎదుట ఏపీవోను నిలదీశారు. ఆర్డీవో అధ్యక్షతన సుంకిడిలో మంగళవారం గ్రామసభ నిర్వహించారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నా బిల్లులు చెల్లించడంలేద ని లబ్ధిదారులు ఏపీవోను నిలదీశారు. ఇలాగైతే నిర్మాణానికి ఎలా ముందుకొస్తారని ప్రశ్నించా రు. త్వరగా బిల్లులు చెల్లించేలా చూడాలని ఆర్డీవోను కోరారు. వేసవిలో చేసిన ఉపాధి హామీ పనుల కూలి డబ్బులు ఇంతవరకు చెల్లించలేదని కొందరు కూలీలు సమస్యను సభ దృష్టికి తెచ్చారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఆర్డీవో మాట్లాడు తూ స్మార్ట్‌కార్డు విధానం ద్వారా చెల్లింపుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. మరుగుదొడ్డి నిర్మించుకున్నవారికి సకాలం లో బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూలీ లకూ త్వరలోనే డబ్బులు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకోవాలన్నారు. తద్వారా మం డలాన్ని ఆదర్శంగా నిలపాలని కోరారు. సభలో తహశీల్దార్ రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీడీవో సునీత, ఏపీవో జగ్దేరావు, సర్పంచ్ గోదావరి, ఉప సర్పంచ్ దీపక్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రమణ, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, నాయకులు జీవన్‌రెడ్డి, ఆశన్నయూదవ్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.