
బంగారాన్ని పరిశీలిస్తున్న పోలీసులు , స్వాధీనం చేసుకున్న కారు
దొడ్డబళ్లాపురం: బిల్లు, తగిన దాఖలు పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రెండు కేజీల బంగారాన్ని దేవనహళ్లి తాలూకా బాలేపుర చెక్‌పోస్టులో పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం హొసకోట నుంచిదేవనహళ్లి మీదుగా వస్తున్న కారును బాలేపుర చెక్‌పోస్టు వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవర్ తన షర్ట్ కింద కడుపు భాగంలో పొట్లాల రూపంలో బంగారాన్ని దాచుకున్న విషయం బయట పడింది. పరిశీలించగా రెండు కేజీలుగా లెక్కతేలింది. ఇందుకు సంబంధించి బిల్లులు లేకపోవడంతో స్వాధీనం చేసుకొని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై చెన్నరాయపట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment