అసెంబ్లీలో తొమ్మిది కొత్త బిల్లులు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా తొమ్మిది బిల్లులను ప్రవేశపెట్టనుంది. శుక్రవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరిగింది. కొత్తగా ప్రవేశపెట్టనున్న బిల్లుల వివరాలు ఇలా ఉన్నాయి.
1. మంత్రులు, ప్రజాప్రతినిధుల జీతభత్యాల పెంపు
2. తెలంగాణ జిల్లాల ఏర్పాటు సవరణ బిల్లు
3. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్ధిపేటల్లో పోలీసు కమిషనరేట్ల ఏర్పాటు బిల్లు
4. తెలంగాణ బీసీ కమిషన్ చట్ట సవరణ బిల్లు
5. తెలంగాణ పురపాలక చట్టాలు, నగరాభివృద్ధి సంస్ధల చట్టాల సవరణ బిల్లు
6. వేంకటేశ్వర పశు వైద్య వర్శిటీల బిల్లు
అయితే, శనివారం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపులపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష కాంగ్రెస్ వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది.