
ట్విటర్‌లో ఖర్చులు తగ్గించేందుకు సీఈవో ఎలాన్ మస్క్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే సగానికి పైగా సిబ్బందిని తొలగించారు. బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందుబాటులోకి తేనున్నారు. వరుస ఆర్ధిక ఇబ్బందులతో సంస్థ దివాలా తీయకుండా నివారించడమే లక్ష్యంగా మరిన్ని పెయిడ్ సర్వీసుల్ని యూజర్లకు పరిచయం చేయనున్నారు.
తాజాగా తాను బాస్‌గా ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు ఉన్న అప్పులతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటున్నారు. వాటిని చెల్లించేందుకు మస్క్ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది.
సంస్థ మాజీ ఎగ్జిక్యూటివ్‌లు ట్రావెల్ ఇన్‌వాయిస్‌ల గురించి అడిగే అధికారం పాత యాజమాన్యం ఎలాన్ మస్క్‌కు ఇవ్వలేదు. కాబట్టే పాత బకాయిల్ని చెల్లించేందుకు మస్క్ నిరాకరిస్తున్నారంటూ ప్రస్తుతం ట్విటర్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు న్యూయార్స్ టైమ్స్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చాంశనీయంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment