-
అప్పులపాలవుతున్న వంట ఏజెన్సీ మహిళలు
ఆత్మకూరు : సర్కారు బడుల్లో వేసవిలో మధ్యా హ్న భోజనం వండిపెట్టిన ఏజెన్సీ మహిళలు బిల్లు లు రాక అప్పులపాలవుతున్నారు. జిల్లాలో 2,049 ప్రాథమిక పాఠశాలలు, 360 యూ పీఎస్‌లు, 510 హైస్కూళ్లు ఉన్నాయి. మొత్తం 2,03,603 విద్యార్థులు ఉండగా, వేసవిలో 30శాతం మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని సద్వినియోగం చేసుకున్నారు.
జిల్లాలోని 2,919 భోజన ఏజెన్సీల మహిళలు వంట చేసి పెట్టి బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయా మండలాల్లో సుమారు రూ. 1.80లక్షల వేతనాలు, రూ.2లక్షల వరకు భోజన బిల్లు బకాయిలు ఉన్నాయి. జిల్లాలో రూ.2కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే గత ఏడాది మార్చి నుంచి ఇప్పటివరకు భోజన కార్మికులకు వేతనాలు కూడా అందలేదు. ఇప్పటికైనా బిల్లులు నెలనెలా చెల్లించాలని భోజన కార్మికులు కోరుతున్నారు.