ఇందూరు : బిల్లులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో పా టు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొం టున్న బోధన్ సీడీపీఓ వెంకటరమణ వ్యవహారం ము దిరింది. బోధన్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీలు ఆమెపై తిరుగుబాటు బావుట ఎగురువేసి ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో ఉన్న ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు.
ఉదయం 10 గంటలకే కార్యాలయం వద్ద బైఠాయించి ఉద్యోగులు లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఐసీడీఎస్ పీడీ రాములుతో సహా ఉద్యోగులు కార్యాలయానికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. పోలీసులు సముదాయించినా ఆందోళనను విరమించలేదు. తొమ్మిది నెలల వేతనాలు, టీఏ, డీఏలు, భవనాల అద్దెలు, ఇతర బిల్లులు మంజూరు చేయించాలని, సీడీపీఓను వెంటనే తొలగించాలని నినదించారు. దీంతో పీడీ రాములు అంగన్‌వాడీలతో మాట్లాడారు.
సీడీపీఓ అక్రమాలకు పాల్పడినట్లుగా రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని సూచించారు. ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే బకాయిలకు సంబంధించి సీడీఎస్ డెరైక్టర్ కార్యాలయానికి లేఖ రాశామని, రాగానే చెల్లిస్తామని చెప్పారు. దీంతో కార్యకర్తలు కొద్దిసేపు ఆందోళన విరమించారు. కొద్దిసేపటి తర్వాత పీడీ కార్యాలయం నుంచి కారులో బయటకు వెళ్తుండడంతో ఆయనను అడ్డుకున్నారు. సీడీపీఓను బదిలీ చేస్తామని చెప్పే వరకు కదలబోమని అక్కడే బైఠాయించారు. దీంతో విసుగు చెందిన పీడీ తన వాహనం నుంచి దిగి కోపంతో జడ్పీ కార్యాలయం వైపు నడుచుకుంటూ వెళ్లారు. ఆయన వెంట అంగన్‌వాడీలు కూడా పరుగెత్తారు. పోలీసులు అక్కడకు చేరుకుని కార్యకర్తలను, సీఐటీయూ నాయకులను అక్కడి నుంచి పంపించి వేశారు.
డెరైక్టర్‌కు సీడీపీఓ వైఖరిపై నివేదిక..
కొన్ని రోజులుగా బోధన్ సీడీపీఓ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు సంబంధించిన బిల్లులను చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రతి పనికి, బిల్లుకు డ బ్బులు అడుగుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. చీరలు, బంగారం కొనిస్తేనే పనులు చేస్తున్నారని పేరుంది. కా వాలనే తొమ్మిది నెలలకు సంంధించిన బకాయి బిల్లులను చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగం ఉంది. ఈ క్రమంలో సీడీపీఓ సెలవులో వెళ్లా రు.
అయితే ఈ విషయమై ఐసీడీఎస్ అధికారుల కు, బోధన్ ఎమ్మెల్యేకు వినతిపత్రాలు సమర్పించిన ప్ర యోజనం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన అం గన్‌వాడీలు బుధవారం ఐసీడీఎస్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. అయితే బోధన్ సీడీపీఓ వైఖరిపై ఐసీడీఎస్ అధికారులు డెరైక్టర్‌కు నివేదికను పంపారు.
బోధన్ సీడీపీఓగా అనురాధ
బోధన్ సీడీపీఓ లాంగ్‌లీవ్‌లో వెళ్లడంతో బాన్సువాడ సీడీపీఓ అనురాధకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించా రు. ఐసీడీఎస్ డెరైక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఐసీడీఎస్ పీడీ రాములు తెలిపారు.
ముదిరిన సీడీపీఓ వ్యవహారం..!
Published Thu, Sep 18 2014 2:47 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement
Advertisement