పార్లమెంట్​ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం | Centre Lists 18 Bills For Upcoming Winter Parliament Session Which Starts From 2023 December 4th Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు.. 18 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం

Published Thu, Nov 30 2023 11:58 AM | Last Updated on Thu, Nov 30 2023 12:31 PM

Centre Lists 18 Bills for Upcoming Winter Parliament Session - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబర్​ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం  నిర్ణయించింది. ఇందులో రెండు జమ్మూకశ్మీర్​, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్​సభ సెక్రటేరియట్​ బులెటిన్​ విడుదల చేసింది.

శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్​ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లు పార్లమెంట్​ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్​ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023‌‌‌‌-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్​ జరగనుంది.

ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది. మరోవైపు సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్​ 2న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు. 
చదవండి: దంపతుల పోట్లాట దెబ్బకు.. దారి మళ్లిన విమానం! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement