
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు చెల్లింపులు సరిగా జరగడంలేదంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించిన కథనం అవాస్తవమని ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది జూలై వరకు నెట్‌వర్క్ ఆస్పత్రులకు క్లెయిమ్స్ చెల్లించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2022–23 సంవత్సరానికి విడుదల చేసిన ఆయుష్మాన్ భారత్ నిధుల్ని నెట్‌వర్క్ ఆస్పత్రులకు వినియోగించారనేది సత్యదూరమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు నేషనల్ హెల్త్ ఏజెన్సీ నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,790 కోట్లు ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించిందని తెలిపారు. ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి నెట్‌వర్క్ ఆస్పత్రులకు రూ.199.5 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఈహెచ్‌ఎస్ కింద ఈ ఏడాది ఇప్పటివరకు 3,25,390 మంది చికిత్స పొందారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment