ఇది కదా జగన్‌ మార్క్‌ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్‌ ఆశ్చర్యం! | Pawan Kalyan Appreciated The Infrastructure Development Under Nadu Nedu Scheme In YS Jagan's Government, Video Inside | Sakshi
Sakshi News home page

ఇది కదా జగన్‌ మార్క్‌ అంటే.. ప్రభుత్వ స్కూళ్లను చూసి పవన్‌ ఆశ్చర్యం!

Published Tue, Nov 5 2024 11:07 AM | Last Updated on Tue, Nov 5 2024 12:15 PM

Pawan Kalyan appreciated the infrastructure development under the government Nadu Nedu scheme

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే..

సాక్షి,కాకినాడ : వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన  హయాంలో నాడు– నేడు పథకం కింద పాఠశాలల రూపు రేఖలను సమూలంగా మార్చి వేసిన సంగతి తెలిసిందే.. ఆ మార్పుల్ని చూసిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ స్కూల్స్‌ కంటే ప్రభుత్వ స్కూల్స్‌ బాగున్నాయంటూ పొగిడారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాకినాడ జిల్లా గొల్లప్రోలు జడ్పీ బాలుర హైస్కూల్‌ను పవన్‌ కల్యాణ్‌ సోమవారం సందర్శించారు.  ఈ సందర్భంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పథకం కింద తీసుకొచ్చిన మౌలిక సదుపాయాలు చూసి ఆశ్చర్యపోయారు. అంతేకాదు, తరగతి గదుల్లో మార్పు చూసి ఇది ప్రభుత్వ పాఠశాలా? లేక ప్రైవేటు పాఠశాల అంటూ పక్కనే ఉన్న అధికారుల్ని అడిగారు. ఆ తర్వాత విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్‌ని చూసి చాలా బాగున్నాయంటూ మెచ్చుకున్నారు.

ఆశ్చర్యానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

 

ఆ తర్వాత అదే స్కూల్‌లో పదవ తరగతి గదిలో విద్యార్ధులు కూర్చునే బెంచీలను పరిశీలించారు. తరగతి గదిలో విద్యార్థులతో కరచాలనం చేస్తూ ఈ బెంచ్‌లు ఎప్పుడు వచ్చాయని అడగారు. అందుకు పవన్‌ పక్కనే ఉన్న కలెక్టర్ షాన్ మోహన్ ఇవి నాడు-నేడు పథకం ద్వారా పథకం కింద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవి అంటూ బదులిచ్చారు.  

2014-2019 చంద్రబాబు హయాంలో 
ఈ సందర్భంగా 2014-2019 గత చంద్రబాబు హయాంలో నాడు పవన్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగుడ మండలంలోని దుంబ్రిగుడ గ్రామానికి చెందిన కస్తూర్బా బాలికల పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో అధ్వాన్నంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను చూసి విచారం వ్యక్తం చేశారు. కూర్చోవడానికి బెంచీలు లేక.. నేల మీద కూర్చొని పాఠాలు వింటున్న విద్యార్థుల్ని పరామర్శించారు. ఆ వీడియోల్ని నెటిజన్లు వీడియోలు షేర్‌ చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాల దుస్థితిని, వైఎస్‌ జగన్‌ హయాంలోని మారిన ప్రభుత్వ రూపురేఖలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

చదవండి : ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి.. ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement