విద్యావిధానం అమలులో ఏపీ భేష్‌ | United Nations Appreciation To Andhra Pradesh Education System | Sakshi
Sakshi News home page

విద్యావిధానం అమలులో ఏపీ భేష్‌

Published Thu, Feb 16 2023 11:00 PM | Last Updated on Wed, Dec 13 2023 6:53 PM

United Nations Appreciation To Andhra Pradesh Education System - Sakshi

స్విట్జర్లాండ్‌లోని జెనీవా ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, విద్యా విధానం బాగున్నాయని కొనియాడారు.

మంచి ప్రాథమిక విద్య, శిక్షణ,  స్థిరమైన అభివృద్ధికి కీలకం అనే అంశంపై స్విట్జర్లాండ్ దేశం జెనీవా లో ఉన్న ఐక్యరాజ్య సమితి కార్యాలాయంలో జరిగిన కార్యక్రమంలో ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఇండియా నుంచి ఐక్యరాజ్య సమితి పర్మినెంట్ మెంబర్ వున్నవ షకిన్ కుమార్ (united nations special consultative status member) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేద విద్యార్ధుల కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న విద్య గురించి ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రస్తావించారు. కరోనా తర్వాత దేశాల్లో ఉన్నటువంటి గడ్డు పరిస్ధితులను మీటింగ్‌లో పలువురు ప్రతినిధులు ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలు పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నాయని  స్విట్జర్లాండ్ అధ్యక్షుడు తెలిపారు.

ఐక్యరాజ్య సమితిలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పధకాల స్టాల్ను సందర్శించిన స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ ప్రభుత్వ పధకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏపీలో విద్య కోసం నాడు-నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలు జరుగుతున్న విద్యాప్రమాణాలను తెలుసుకుని అభినందించారు. నాడు-నేడులో భాగంగా  డిజిటల్ లెర్నింగ్, నాణ్యతమైన విద్యలో భాగంగా విద్యార్ధులకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి  కంప్యూటర్ ట్యాబ్లు పంపిణీ, శిధిలావస్ధలో ఉన్నటువంటి పాఠశాలలను ఆధునీకరించడం, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ఆధునిక పద్ధతుల్లో నూతన విద్యావిధాన బోధన వంటివి పేదవిద్యార్ధులకు ఎంతో మేలు చేస్తుందని వారన్నారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారన్నారు.

విద్యార్ధులకు మధ్యాహ్న భోజనంలో న్యూట్రీషన్ ఫుడ్ అందించడం వంటివి బాగున్నాయన్నారు. లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ఎస్పెషల్లీ ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్ అనేది చాలా నచ్చిందన్నారు పాట్రిసియా దన్జీ. 

యూఎన్‌ఓలో ఆంధ్రప్రదేశ్ క్వాలిటీ ఎడ్యుకేషన్  సిస్టమ్  స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. లింగ అసమానతలను పోగెట్టేలా ఆడపిల్లకు అందిస్తున్న గర్ల్స్ ఎడ్యుకేషన్ విధానాన్ని అభినందించారు. దీని ద్వారా అమ్మాయిలకు విద్య అనేది చాలా ముఖ్యమనదన్నారు. డిజిటల్ ఎడ్యుకేషన్ బెస్ట్ గా ఉందన్నారు. బైజ్యూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో విద్యా విధానం అనేది బాగుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement