గుంటూరు ఎడ్యుకేషన్: నైపుణ్యాభివృద్ధి, ఇంటర్న్‌షిప్ ఉద్యోగాల కల్పనలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తున్నదని, ఉన్నత విద్యారంగంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు కారణమని పలువురు వక్తలు స్పష్టం చేశారు. గుంటూరు ఏసీ కళాశాలలో సోమవారం ఏపీఎస్‌సీహెచ్‌ఈ ఆధ్వర్యంలో ‘ఉన్నత విద్యలో సంస్కరణలు–యువతకు సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కొమ్మాలపాటి మోజెస్ అధ్యక్షత వహించిన సదస్సుకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్‌సీహెచ్‌ఈ) వైస్ చైర్మన్ ప్రొఫెసర్, కె.రామమోహనరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. సాధారణ డిగ్రీ కోర్సులతో యువతకు ప్రయోజనం లేదని గుర్తించిన సీఎం జగన్ ప్రభుత్వం ఉన్నత విద్యలో సమూల మార్పులు తెచ్చిందన్నారు. ఆ.. సంస్కరణలు అద్భుతమైన ఫలితాలిస్తున్నాయని చెప్పారు.
ఉన్నత విద్యలో నవరత్నాల వంటి తొమ్మిది కార్యక్రమాలను రూపొందించిన సీఎం వైఎస్ జగన్ ఎంతో నిబద్ధతతో అమలు చేస్తున్నారని తెలిపారు. ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశపెట్టిన ఇంటర్న్ షిప్ విధానంలో విద్యార్థులను పరిశ్రమలకు అనుసంధానం చేయడంతో విద్యార్థులు తమలోని సామర్థాన్ని, నైపుణ్యాలను స్వయంగా తెలుసుకుని ముందుకు వెళుతున్నారని చెప్పారు. రూ.32కోట్లు వెచి్చంచి రాష్ట్రంలోని 1.25 లక్షల మంది యువతకు పైసా ఖర్చు లేకుండా మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సు అందించడం గొప్ప విషయమన్నారు. బీహెచ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.కౌసల్యాదేవి, ఏసీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్స్ ఎం.కుసుమకుమారి, జీఏ షాలిని, బి.విజయకుమార్, అధ్యాపకులు ఎం.రత్నరాజు, సీహెచ్ అనిత, ఎన్‌జే సాల్మన్‌బాబు మాట్లాడారు. వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యువతకు దిశా, దశ నిర్దేశనం
ఉన్నత విద్యలో ఏపీ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు యువతకు దిశా, దశ చూపుతున్నాయి. నైపుణ్యాలు లేనిదే సమాజంలో రాణించలేరనే సదుద్దేశంతో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నది. విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విజ్ఞానాన్ని అందిస్తూ, ప్రపంచంలో ఎక్కడైనా రాణించగల స్థైర్యాన్ని కల్పించడం అభినందనీయం.
– కేఎఫ్ పరదేశిబాబు, ఏసీ కళాశాల కరస్పాండెంట్
ఎన్‌ఈపీ అమల్లో ఏపీ అగ్రస్థానం..
జాతీయ నూతన విద్యా విధానం–2020 అమల్లో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలిపారు. విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీపడే విధంగా నైపుణ్యంతో కూడిన విద్యను అందించేందుకు ఆయన సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు వెళుతున్నారు. విజ్ఞానం, నైపుణ్యం, నూతన ఆవిష్కరణల దిశగా విద్యార్థులు ముందుకు సాగాలి.
– డాక్టర్ కె.మోజెస్, ప్రిన్సిపాల్, ఏసీ కళాశాల
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఉన్నత విద్యారంగంలో అమలు చేస్తున్న అనేక సంస్కరణలతో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. పరిశ్రమలను విద్యాసంస్థలకు అనుసంధానం చేయడంలో సఫలీకృతమైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువతరానికి అందిస్తోంది.
– పి.మల్లికార్జునప్రసాద్, ప్రిన్సిపాల్, హిందూ కళాశాల
ఊహకందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
సాధారణ సెల్‌ఫోన్‌తో మొదౖలెన ఆధునిక సాంకేతికత.. ఇంటర్నెట్‌తో వేగం పుంజుకుని ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ వరకు ఎదిగింది. ఈ పరిస్థితుల్లో నైపుణ్యం లేనిదే విద్యార్థులు రాణించలేరు. ఉన్నత విద్య దశలోనే పోటీతత్వంతో ముందుకు వెళ్లాలి.
– డాక్టర్ ఎంఎస్ శ్రీధర్, పీజీ కోర్సుల డీన్, ఏసీ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment