
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా 'జగనన్న విద్యాకానుక'ను ప్రారంభించారు. విద్యాకానుక కింద కొంతమంది విద్యార్ధులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం పి. గన్నవరం జెడ్పీహెచ్ స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులు వేదికపై తమ అనుభవాలను పంచుకున్నారు.
‘‘ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నందుకు గర్వంగా ఫీలవుతున్నా. జగన్ మామయ్య మా స్కూల్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉంది. మా నాన్న టైలర్, అమ్మ గృహిణి. జగన్ మామయ్య విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అన్ని ప్రభుత్వ పథకాలకు గానూ ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాము. కొత్త విద్యా విధానం.. కొత్త కొత్త అవకాశాలకు తలుపు తెరుస్తోంది. గతంలో పేద కుటుంబాలనుంచి వచ్చిన వాళ్లు సరైన చదువులు లేక తమ ఆశయాలను సాధించలేకపోయేవారు. కానీ, జగన్ మామయ్య సీఎం అయిన తర్వాత విద్యార్థులు సంతోషంగా తమ చదువుల్ని పూర్తి చేస్తున్నారు. నాణ్యమైన విద్యను పొందుతున్నారు. చాలా మంచి పథకాలను జగన్ మామయ్య ప్రవేశపెట్టారు.
‘జగనన్న విద్యాకానుక’.. ‘అమ్మ ఒడి’.. ‘జగనన్న వస్త్ర దీవెన’.. ‘జగనన్న విద్యాదీవెన’.. ‘జగనన్న గోరుముద్ద’.. వంటి పథకాలు చాలా అద్భుతమైనది. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. మన బడి నాడు-నేడు ఓ కోహినూర్ వజ్రం. ఈ పథకం ద్వారా స్కూళ్లు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాయి. పిల్లలను చూసుకోవటానికి ఆయాలను పెట్టారు. మంచి భోజనం అందిస్తున్నారు. విద్యార్థులే కాదు తల్లిదండ్రులు కూడా జగన్ మామయ్య పథకాలతో ఎంతో లబ్ధిపొందుతున్నారు. జై జగన్ మామయ్య.. జై జై జగన్ మామయ్య’’
- సాయి శరణ్య, పదవ తరగతి, జెడ్‌పీపీ హై స్కూల్, పి. గన్నవరం