వైఎస్ జగన్ సెక్యూరిటీపై ఈనాడు అవాస్తవాలు
983 మందితో భద్రత అంటూ దుష్ప్రచారం
భద్రతా విధుల్లో ఉన్నది 196 మందే
నాడు చంద్రబాబు కుటుంబానికి భారీ భద్రత
నిబంధనల మేరకు జగన్‌కు కల్పించిన భద్రతపై అబద్ధాల రాతలు
సాక్షి, అమరావతి: అవాస్తవాలు, అభూత కల్పనలే ఆసరాగా బతికేస్తున్న పచ్చ మీడియా వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై మరోసారి బురద జల్లే ప్రయత్నం చేసింది. ఆయనకు కల్పిస్తున్న భద్రతపై ఈనాడు పత్రిక అభూత కల్పనలతో అసత్య కథనాన్ని అచ్చేసింది. ఆయనకు 983 మందితో భారీ భద్రత కల్పించినట్లు అబద్ధాలతో కథనాన్ని వండింది.
ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లకు ఉన్నత స్థాయి సెక్యూరిటీ రివిజన్ కమిటీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంటుందని, ఆ కమిటీ నిర్ణయం మేరకే ఏర్పాట్లు జరుగుతాయన్న కనీస జ్ఞానం ఆ పత్రికకు లేకపోయింది. వాస్తవంగా వైఎస్ జగన్‌కు ఉన్న భద్రతా సిబ్బంది ఎందరు అన్న విషయాన్ని పరిశీలించాలన్న నైతిక విలువలకూ తిలోదకాలిచ్చి నోటికొచ్చిన సంఖ్యలతో ఉద్దేశపూర్వకంగా దు్రష్పచారం చేస్తోంది.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం వద్ద ఈనాడు చెప్పినట్లుగా 983 మంది భద్రతా సిబ్బంది లేరు. కాన్వాయ్ కాంపొనెంట్‌తో కలిపి కేవలం 196 మందే విధుల్లో ఉన్నారు. అదీ షిఫ్ట్లులవారీగా భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు.
సెక్యూరిటీ రివిజన్ కమిటీ సమావేశం కాకుండానే
ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లను ఉన్నత స్థాయిలోని సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ఆ కమిటీ సూచనల మేరకే భద్రతా ఏర్పాట్లు కల్పించాల్సి ఉంటుంది. ఏ ముఖ్యమంత్రీ తనకు ఇంత భద్రత కావాలని అడగరు. సెక్యూరిటీ రివిజన్ కమిటీయే అన్ని అంశాలను విశ్లేíÙంచి ఎంత మేర భద్రత కల్పించాలన్నది ఖరారు చేస్తుంది.
ముఖ్యమంత్రి నివాసం, పరిసర ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు, మార్పులు, చేర్పులు తదితర అంశాలను కూడా ఈ కమిటీ ఆదేశాల మేరకే చేపడతారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయన నివాసం వద్ద భద్రతా ఏర్పాట్లను సెక్యూరిటీ రివిజన్ కమిటీ నిర్ణయం మేరకే చేపట్టారు.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తరువాత సెక్యూరిటీ రివిజన్ కమిటీ ఇంకా సమావేశమవ్వనే లేదు. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రుల భద్రత ఏర్పాట్లపై సమీక్షించనే లేదు. కానీ ఈనాడు పత్రిక మాత్రం దురుద్దేశపూరిత కథనం ప్రచురించడం ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నమే.
నాడు బాబు మనవడికి కూడా భద్రత
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మనవడు దేవాన్‡్షకు కూడా ప్రత్యేకంగా భద్రత కల్పించారనే వాస్తవాన్ని ఈనాడు ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్‡్షకు ప్రత్యేకంగా భద్రత కల్పించారు.
ఉండవల్లిలోని చంద్రబాబు కరకట్ట నివాసంతోపాటు హైదరాబాద్‌లోని వారి నివాసం, చివరకు ఫామ్ హౌస్ వద్ద కూడా భారీ భద్రత కల్పించడం గమనార్హం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కల్పించిన భద్రతకంటే ఎన్నో రెట్లు అధికంగా భద్రత కల్పించారు. ఈ అధికార దురి్వనియోగంపై ఏనాడూ పట్టించుకోని ఈనాడు.. ఉన్నత స్థాయి కమిటీ సూచనల మేరకు నిబంధనల ప్రకారం వైఎస్ జగన్‌కు కల్పించిన భద్రతపై అభూత కల్పనలు ప్రచురించింది.
వివిధ విభాగాల నుంచి విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది వివరాలు
సివిల్ పోలీసులు: సీఐ–1, ఎస్సైలు–4, హెడ్ కానిస్టేబుల్–1,
కానిస్టేబుళ్లు –12 , మహిళా కానిస్టేబుల్ –1.
ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు: ఆర్‌ఎస్సైలు – 2, ఏఆర్‌ఎస్సై –1,
కానిస్టేబుళ్లు – 28
ఏపీఎస్పీ: డీఎస్పీ –1, ఆర్‌ఎస్సై – 3, ఏఆర్‌ఎస్సై–2,
హెడ్ కానిస్టేబుళ్లు – 14, కానిస్టేబుళ్లు – 69
ఆక్టోపస్: ఆర్‌ఐ –1, ఆర్‌ఎస్సైలు –2, కానిస్టేబుళ్లు–10
మొత్తం: 152 మంది
ఐసోలేషన్‌లో: అదనపు ఎస్సీ – 1, ఆర్‌ఐ – 2, ఆర్‌ఎస్సై – 3, కానిస్టేబుళ్లు – 17
మొత్తం: 23 మంది
కాన్వాయ్ విభాగంలో: సీఐ – 1,
ఎస్సై – 3, హెడ్ కానిస్టేబుల్ – 1,
కానిస్టేబుళ్లు – 16
మొత్తం: 21 మంది.
Comments
Please login to add a commentAdd a comment