రామోజీని సత్వరమే ‘నేత్రాలయానికి’ పంపించాలి
ఇసుకపై నివేదికలంటూ కట్టుకథలు
అధికారులు కోర్టుకివ్వాల్సిన నివేదికలు మీకిచ్చారా ?
ఒకవేళ అవి మీకొస్తే ప్రజాస్వామ్యానికే ప్రమాదం కాదా?
ప్రభుత్వంపై బురద జల్లేందుకు అడ్డగోలు రాతలు
కృష్ణా జిల్లా గనుల శాఖ అధికారి నివేదిక ఎప్పుడు ఇచ్చారు?
దాన్ని మార్చేందుకు ప్రయత్నాలంటూ ఊహాజనిత కథనాలు
ఇసుకపై పారదర్శక విధానం కనిపించడం లేదా?
టీడీపీ హయాంలో కళ్లు మూసుకుని ఇప్పుడు దొంగ ఏడుపులు
చంద్రబాబు మెప్పు కోసం గుడ్డి ఆరోపణలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై రాజ గురువు రామోజీ పదే పదే విషం కక్కుతూ చివరికి కోర్టుల్ని సైతం పక్కదారి పట్టించేలా తప్పుడు రాతలు రాస్తున్నారు. అధికారులు ఇసుకపై కోర్టులకు ఇవ్వాల్సిన నివేదికలు తనకే ఇచ్చినట్లు ఊహించుకుని ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు. ‘ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే.. కృష్ణా జిల్లా గనుల శాఖాధికారి సంచలన నివేదిక’ పేరుతో రామోజీ రోత పత్రిక వాస్తవాలకు మసి పూసి పూర్తిగా వక్రీకరించి అడ్డగోలు కథనాన్ని ప్రచురించింది.
నివేదికలో అంతా అక్రమాలే జరిగాయని ఒక అధికారి నివేదిక ఇచ్చారంట.. అది ఈయనగారికి చెప్పారంట? దాన్నే ఏ ఆధారం లేకుండా అబద్దాలతో అచ్చేశారు. కోర్టులకు వెళ్లాల్సిన నివేదికలు అంతకంటె ముందు రామోజీ, ఈనాడు కార్యాలయాలకు వెళుతున్నాయంటే అది నమ్మాలా? ఒకవేళ నిజంగా అలా జరిగితే రామోజీరావు కోర్టుల్ని కూడా డిక్టేట్ చేస్తున్నారా?. ఇసుక తవ్వకాలపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ విచారణ జరుగుతుంటే దానిపై కోర్టును ధిక్కరించేలా అడ్డగోలు కథనాలు రాసి మరీ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.
జిల్లా కలెక్టర్లు ఇసుక రీచ్‌లను మరోసారి పరిశీలించి సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో జిల్లా గనుల శాఖ అధికారితో సహా సంబంధిత అధికారుల బృందం ఇసుక రీచ్‌లను సందర్శించి నివేదికలను రూపొందిస్తున్నాయి. రూపొందించాక కోర్టుకు సమర్పించనున్నారు. ఈలోపే అక్రమ తవ్వకాలు జరిగాయని ఈనాడుకు తెలిసిపోతుందా? నివేదిక తయారు కాకుండానే అందులో ఏం రాస్తారో ఊహించుకుని తన ఇష్టానుసారం వార్తలు రాస్తారా?
ఈ కథనాల ద్వారా కోర్టుల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడమేగా? జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందం సంయుక్తంగా తనిఖీలు చేసి, సమర్పించిన నివేదికలు మార్చేందుకు వీలుంటుందా? అలా మార్చేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారా? ఈనాడు మాత్రం కనీస అవగాహన లేకుండా అక్రమాలు జరిగిపోతున్నాయని ఊహించుకుని, నివేదికలో అవి జరిగాయని ఊహించుకుని కథనాలు రాసేసింది. అక్రమ తవ్వకాలపై నిరంతర పర్యవేక్షణ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగకుండా గనులశాఖ, ఎస్‌ఇబి నిరంతరం పర్యవేక్షణ జరుపుతోంది.
ఎక్కడ అక్రమాలు జరిగినా ఉక్కుపాదం మోపుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉంటే ఆ విషయాన్ని కూడా పట్టించుకోకుండా అబద్ధాలు రాసింది. కేవలం రాజకీయ దురుద్ధేశంతో ప్రభుత్వంపై బుదరచల్లే పనిలో భాగంగా తరచూ ఇలాంటి కథనాలు రాస్తోంది. అందుబాటు ధరలోనే ఎక్కడా ఇసుక కొరత లేకుండా ప్రజలకు అందించడాన్ని తట్టుకోలేక అడ్డగోలుగా బురదజల్లుతున్నారు. పర్యావరణ అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ రాష్ట్రంలో పారదర్శకంగా జరుగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలను అరికట్టేందుకు ప్రత్యేకంగా ఎస్‌ఇబిని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సరిహద్దులు దాటి ఇసుక రవాణా జరగకుండా అన్ని చోట్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. ఇంత పకడ్భందీగా ఇసుక ఆపరేషన్స్ జరుగుతుంటే దానిపై అదే పనిగా అబద్ధపు ప్రచారం చేస్తోంది. 4 వేల కోట్ల విలువ లేని ఇసుక కాంట్రాక్టులో రూ.40 వేల కోట్ల దోపిడీయా? రాష్ట్రంలో ఇసుక దోపిడీకి ఏపీఎండీసీ సహకారం అందిస్తోందంటూ టీడీపీ అధికార ప్రతినిధి ఒకరు సోమవారం కామెడీ షో నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్ కోసం టెండర్లు పిలిచిన మొత్తం కాంట్రాక్ట్ విలువే రూ.4 వేల కోట్ల లోపు ఉంటే, ఏకంగా రూ.40వేల కోట్ల ఇసుక దోపిడీ ఎలా జరుగుతుందో ఆ మహా మేధావికే తెలియాలి.
ఏపీఎండీసీ శరవేగంగా అమలులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రాజెక్టులు చేపట్టేందుకు అవసరమైన నిధులను బాండ్లను జారీ చేయడం ద్వారా మార్కెట్ నుంచి సేకరించేందుకు ఏపీఎండీసీ నిర్ణయించింది. బాండ్ల కోసం సేకరించే మొత్తం, దానికి చెల్లించే వడ్డీ కన్నా అధికంగా రెవెన్యూ ఆర్జించే అవకాశం ఉన్న ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టనుంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపి వాణిజ్య ప్రయోజనం అందించే ప్రాజెక్టులనే బాండ్ల ద్వారా సేకరించిన సొమ్మును పెట్టుబడి వ్యయంగా పెట్టాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది.
ఈ బాండ్ల సేకరణ ప్రక్రియ ఇంకా నడుస్తుండగానే ఏపీఎండీసీ రూ.7 వేల కోట్లకు బాండ్లు జారీ చేసిందని ఆరోపణలు చేయడం విడ్డూరమే. బాండ్ల కోసం ఆసక్తి వ్యక్తం చేసిన వారి వివరాలే తెలియకుండా, బాండ్ల జారీనే జరగకుండా, రూ.7 వేల కోట్లు ఎలా సేకరిస్తారో ఆ ప్రతినిధికే తెలియాలి? అసలు సేకరణే జరగని సొమ్మును ప్రభుత్వానికి ఎలా బదిలీ చేస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చంద్రబాబు మెప్పు కోసం ఆరోపణలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment