రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం Political and film celebrities have condoled Ramoji Rao's death. Sakshi
Sakshi News home page

రామోజీరావు అస్తమయంపై ప్రముఖుల సంతాపం

Published Sat, Jun 8 2024 9:02 AM | Last Updated on Sat, Jun 8 2024 4:01 PM

Celebrities Mourn The Death Of Ramoji Rao

సాక్షి, హైదరాబాద్‌: రామోజీరావు మరణం పట్ల రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీతో పాటు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వెంకయ్యనాయుడు, కిషన్‌రెడ్డి తదితరులు తమ సంతాపం తెలియజేశారు. ప్రస్తుతం ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివ దేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. రేపు ఉదయం అంత్యక్రియలు జరగనున్నాయి.

వెంకయ్యనాయడు.. 

  • చేపట్టిన ప్రతీ పనిలో రామోజీరావు విజయంసాధించారు
  • ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా గర్వపడేలా చేశారు
  • ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి
  • రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా

కేటీఆర్‌
జర్నలిజానికి గుర్తింపుగా చిరకాలం నిలిచారు
ఫిిల్మ్‌సిటీ నిర్మాణం రామోజీరావుకే సాధ్యమైంది
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నటుడు రజినీకాంత్‌

  • నా గురువు, నా శ్రేయోభిలాషి రామోజీరావు ఇక లేరని తెలిసి తీవ్ర విచారానికి గురయ్యా
  • పాత్రికేయ రంగంలో, సినిమాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి రామోజీ రావు
  • రాజకీయాల్లో గొప్ప కింగ్ మేకర్ అనిపించుకున్నారు
  • నా జీవితంలో రామోజీరావుకు ప్రత్యేక స్థానం ఉంది
  • ఆయన నాకు మార్గదర్శకుడు, నాకు స్ఫూర్తి ప్రదాత
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా

చంద్రబాబు

  • రామోజీరావు మరణం పట్ల చంద్రబాబు సంతాపం
  • ఫిల్మ్‌సిటీలో రామోజీరావు పార్థివదేహానికి నివాళులు
  • రామోజీ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు
  • రామోజీరావు మరణం చాలా బాధాకరం: చంద్రబాబు
  • రామోజీరావు ఒక వ్యక్తి కాదు.. వ్యవస్థ
  • తెలుగు జాతి కోసం అహర్నిశలు కృషిచేశారు
  • ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కృషి చేసేవారు
  • ఎప్పుడూ ప్రజల పక్షంగానే నిలబడతానని ఎప్పుడూ స్పష్టంగా చెప్పేవారు
  • ఆయన సమాజహితం కోసం పని చేశారు
  • చిత్రపరిశ్రమకు కూడా ఎనలేని సేవలు అందించారు
  • రామోజీరావు లాంటి వ్యక్తిని పొగొట్టుకోవడం బాధగా ఉంది

మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రామోజీ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ ద్వారా సీఎం ఆదేశాలు జారీ చేశారు.

1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

రామోజీరావుకు సినీ ప్రముఖులు సంతాపం
ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) మృతి పట్ల సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది. ‘ఓం శాంతి’. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని ఎక్స్‌ వేదికగా చిరంజీవి తన సంతాపాన్ని ప్రకటించారు. రజనీకాంత్‌, మహేశ్‌బాబు, ఎన్టీఆర్‌, వెంకటేశ్‌తో పాటు పలువురు స్టార్‌ హీరోలు ఎక్స్‌ వేదికగా రామోజీరావుకి సంతాపం తెలిపారు. 



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement