గురివింద తలా తోకలేని రాతలు
వలంటీర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్నాక వాట్సాప్ గ్రూపులు ఎలా సాధ్యం?
సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ రోత రాతలు చూస్తుంటే ప్రభుత్వం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరినా వారిపై ఎన్నికల సంఘం ఎడాపెడా కేసులు నమోదు చేయాల్సిందేననే ఆక్రోశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడంపై వలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ల వద్ద విధులు నిర్వహించే ఎమ్మెల్వోలపై ఏడుపుగొట్టు కథనాలను ప్రచురించింది. ఒకవైపు వలంటీర్లను ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కాజేసే దొంగలుగా చిత్రీకరిస్తూ మరోవైపు తాయిలాలను ఎర వేయడంపై విస్మయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలను వైఎస్సార్‌సీపీ స్లీపర్ సెల్స్‌లా ప్రజలపైకి వదిలారు.
వాస్తవం: వలంటీర్లు ప్రజల నుంచి ఎలాంటి వ్యక్తిగత సమాచారం సేకరించరు. ప్రభుత్వ పథకాల అమలు ప్రక్రియలో సేకరించే వివరాలను యాప్‌లో నమోదు చేయగానే నేరుగా రాష్ట్ర ప్రభుత్వ అ«దీనంలో ఉండే డేటా సెంటర్‌లో నిక్షిప్తమవుతుంది. వలంటీర్ల వద్ద ఉండే మొబైల్ యాప్‌లోని సమాచారాన్ని పరిశీలించేందుకు ఎమ్మెల్వోలకు లాగిన్ అవకాశం ఉండదు.
ఈనాడు ఆరోపణ: ఎమ్మెల్వోలు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు.
వాస్తవం: వలంటీర్ల నుంచి ఫోన్లు, నంబర్లను స్వాదీనం చేసుకున్నాక వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేయడం ఎలా సాధ్యమో ఈనాడుకే తెలియాలి.
Comments
Please login to add a commentAdd a comment