
హైదరాబాద్, సాక్షి: రామోజీగ్రూప్ సంస్థల అధిపతి చెరుకూరి రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోని స్మృతి వనంలో తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు జరిగాయి. రామోజీరావు చితికి కుమారుడు, ఈనాడు ఎండీ సీహెచ్ కిరణ్ నిప్పంటించారు.
రామోజీరావుకు గౌరవ వందనంగా గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపారు పోలీసులు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముగ్గురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
ఇక.. అంత్యక్రియలకు భారీ సంఖ్యలో రామోజీ సంస్థల ఉద్యోగులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంతకు ముందు ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతి వనం దాకా అంతిమయాత్ర కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామోజీరావు అంతిమ యాత్రలో పాల్గొని పాడె మోశారు. ఆయన కుటుంబ సభ్యుల కూడా ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు ఈ ఉదయం కూడా పలువురు ప్రముఖులు రామోజీ పార్థివదేహానికి నివాళులర్పించారు. అంతిమ సంస్కారాలను వీక్షించేందుకు స్మృతివనంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం గమనార్హం.


ఇదీ చదవండి: పెదపారుపూడి టు ఫిలింసిటీ

Comments
Please login to add a commentAdd a comment