వర్ధన్నపేట చర్చిలో కేక్ కట్ చేస్తున్న ఎమ్మెల్యే అరూరి రమేష్
వర్ధన్నపేట: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం వర్ధన్నపేట పట్టణంలోని మన్నా ప్రార్థన మందిరంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా అరూరి రమేష్ మాట్లాడుతూ సమైక్య పాలనలో ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థన మందిరాలకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహర్దశ వచ్చిందని తెలిపారు. ప్రభుత్వ కృషితో రాష్ట్రంలో ఆధ్యాత్మికత వెల్లి విరుస్తోందన్నారు.
ధూపదీప నైవేద్య అర్చకులకు రూ.6 వేల నుంచి రూ.10 వేలకు గౌరవ వేతనాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకుని అమలు చేస్తున్నారన్నారు.కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మునిసిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణ, వార్డు కౌన్సిలర్లు తుమ్మల రవీందర్,తోటకూరి రాజమణి తదితరులు పాల్గొన్నారు. ఇల్లంద గ్రామంలోని శ్రీరామలింగేశ్వర, లక్ష్మి నర్సింహస్వామి ఆలయాల్లో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జెడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు శ్రీనివాస్, పిట్టల జ్యోతి ప్రత్యేక పూజ లు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఆశీ ర్వదించి స్వామివారి శేష వస్త్రాలను అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment