♦ 2015లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన ప్రచారార్భాటానికి గోదావరి పుష్కరాలను వాడుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రిలోని వీఐపీ ఘాట్‌లో కాకుండా సాధారణ భక్తులకు కేటాయించిన ఘాట్‌లో పుష్కర స్నానాలకు వెళ్లారు. ఒక డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ప్రజలను నియంత్రించి.. ఒక్కసారిగా వదిలేయడంతో తొక్కిసలాట జరిగి ఏకంగా 29 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.
♦ 2016లో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లకు అడ్డుగా ఉన్నాయని సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలతో విజయవాడలో దాదాపు 30 ఆలయాలు కూల్చి వేశారు. శనైశ్వర స్వామి వారి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, బొడ్డు బొమ్మ, వీరబాబు ఆలయం, అమ్మవారి పాత మెట్ల మార్గంలోని ఆంజనేయ స్వామి ఆలయం, వినాయక ఆలయం, గో సంరక్షణ సంఘంలోని కృష్ణ మందిరం, దక్షిణాముఖ ఆంజనేయ స్వామి ఆలయం, పద్మావతి ఘాట్ సమీపంలోని సాయిబాబా మందిరం, మల్లేశ్వర స్వామి ఆలయం మెట్ల మార్గంలోని వీరాంజనేయ స్వామి ఆలయం, పాత మెట్ల మార్గంలోని శృంగేరీ పీఠానికి చెందిన వీరాంజనేయ స్వామి ఆలయం, కొండపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మౌన స్వామి ఆలయం తదితర ఆలయాలు కూల్చివేతకు గురయ్యాయి.
♦ విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయం కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
♦ విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో బోడికొండపైనున్న శ్రీ కోదండరాముని ఆలయం 2014 అక్టోబరులో సంభవించిన హుద్‌హుద్ తుపాను ప్రభావంతో శిథిలమైంది. ప్రహరీ, ధ్వజస్తంభం పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త టీడీపీ సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్‌గజపతిరాజే. అప్పుడు సీఎంగా ఉన్నదీ చంద్రబాబే. వీరెవ్వరూ పట్టించుకోక పోవడంతో దుండగులు కోదండ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఆదాయం లేని ఆలయాలలో నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు అమలు చేసే డీడీఎన్‌ఎస్ పథకం 1,620 ఆలయాల (అందులో 1500 దాకా ఉమ్మడి ఏపీలో మంజూరు చేసినవే)కు మాత్రమే వర్తింపు.
శిథిలమైన రామతీర్థం ఆలయం రూ.4 కోట్లతో పునర్నిర్మాణం. నిపుణులైన శిల్పులతో సీతా సమేత కోదండరాముడు, లక్ష్మణ విగ్రహాల తయారీ. ఆకర్షణీయంగా గర్భాలయం తర్వాత అర్ధ, ముఖ మండపాలు. ధ్వజస్తంభాన్ని పునరుద్ధరణ. పటిష్టంగా ప్రహరీ నిర్మాణం. మొత్తంగా 2022 ఏప్రిల్ 15వ తేదీన పునఃప్రతిష్ట.
రాష్ట్ర సంక్షేమం, సర్వతోముఖాభివృద్ధి కాంక్షిస్తూ ‘అష్టోత్తర శతకుండాత్మక చండి, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం’ నిర్వహణ. – సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, విజయవాడ, విజయనగరం
♦ చంద్రబాబు ప్రభుత్వం విజయవాడలో కూల్చి వేసిన ఆలయాల్లో ప్రధానంగా 8 ఆలయాల పునఃనిర్మాణం. ఈ ఎనిమిది ఆలయాలకు 2021 జనవరి 8న సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన. రూ.3.87 కోట్లతో నిర్మాణాలు పూర్తి. డిసెంబరు 8వ తేదీన భక్తులకు అంకితం. మరో ఐదు ఆలయాలలో ప్రధానమైన మౌన స్వామి విగ్రహం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో తిరిగి ఏర్పాటు. పాత మెట్ల మార్గంలోని ఆంజనేయస్వామి, మల్లేశ్వర స్వామి మెట్ల మార్గంలోని వీరాంజనేయస్వామి విగ్రహాలకు బ్రాహ్మణ వీధిలోని వాటర్ ట్యాంక్ వద్ద ఆలయాల్లో పూజా కార్యక్రమాలు.
♦ దుర్గగుడి అభివృద్ధి కోసం రూ.70 కోట్లు మంజూరు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం. రూ.216 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు, ఎనర్జీ, వాటర్ వర్క్స్, అన్నప్రసాద భవనం, పోటు భవనం, ఎలివేటెడ్ క్యూకాంప్లెక్స్, రాజగోపురం ముందు మెట్ల నిర్మాణం, మహారాజ ద్వారం, నూతన కేశఖండనశాల తదితర అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
♦ 757 పురాతన ఆలయాలను కామన్‌గుడ్ ఫండ్ నిధులతో పునః నిర్మాణం చేయడంతో పాటు టీటీడీ శ్రీవాణి ట్రస్టు నిధులతో దేవదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార కాలనీల్లో కొత్తగా 2,872 ఆలయాల నిర్మాణం. ఇప్పుడు నిత్య ధూప దీప నైవేద్య నిర్వహణకు డీడీఎన్‌ఎస్ పథకం 4,834 ఆలయాలకు వర్తింపు
Comments
Please login to add a commentAdd a comment