భారతదేశం ఆధ్యాత్మికతకు నిలయం. ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలకు పేరుగాంచింది. వేదభూమి, కర్మభూమిగా పేరుగాంచిన ఈ భారతావనిలో రాజకీయనేతలను దేవుళ్లుగా భావించి పూజించిన ప్రజలు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ అభిమాన నేతకు గుడికట్టించి మరీ భక్తిగా కొలుచుకుంటున్నారు. కొందరూ అనుచరులు, కార్యకర్తల్లో వారి అభిమాన నాయకుడిపై విపరీతమైన అభిమానం ఇలా భక్తిగా మారి దేవాలయాలకు నిర్మించి కొలుచుకునే వరకు వెళ్లిపోయింది. ఆ ఆలయాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? అంతటి అభిమానాన్ని పొందిన నాయకులెవరూ తదతరాల గురించి సవివరంగా చూద్దామా..!
సోనియా గాంధీ
తెలంగాణలోని కరీంనగర్‌లో భారత జాతీయ కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ కోసం ఆమె మద్దతుదారులు దేవాలయం నిర్మించి మరీ దేవతగా కొలుచుకుంటున్నారు. వారి ప్రాంతానికి, దేశానికి చేసిన కృషి కారణంగా ఆమెను దేవతలాం చూస్తారు వాళ్లంతా. అంతేగాదు ఈ ఆలయంలో ఆమెకు పూజలు చేసి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు ప్రజలు. స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు ఆమె పట్ల కృతజ్ఞతతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె నాయకత్వంలో తమ ప్రాంతానికి గణనీయమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు వచ్చాయని అక్కడి ప్రజల ప్రగాఢ నమ్మకం.
నరేంద్ర మోదీ..
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి పెద్ద సంఖ్యలో అనుచరలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లలో ఆయన గౌరవార్థం దేవాలయాలను నిర్మించారు మోదీ అభిమానులు . ఉత్తరప్రదేశ్‌లో మోదీ విధానాలు, నాయకత్వం పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేలా ఒక మద్దతుదారుడు ఆయన కోసం గుడి కట్టాడు. ఆ ఆలయంలో మోదీ విగ్రహం ఉంటుంది. ఇక్కడ ప్రజలు మోదీ విగ్రహానికి పూజలు చేయడమే గాక ఆయన మార్గదర్శకత్వంలోనే పయనిస్తుంటారు కూడా.
ఇక మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా మోదీకి మరో ఆలయం ఉంది. ఇక్కడ ఆయన ప్రధానిగా భాద్యతలు చేపట్టిన రోజుని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఆలయాన్ని ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధికి ప్రతీకగా నిర్మించారు. ఆయనను పూజించటం తమ అదృష్టంగా భావిస్తామని, ఆయన తమకు స్ఫూర్తి అని అక్కడి ప్రజలు చెబుతున్నారు.
మాయవతి..
బహుజన్ సమాజ్‌వాద్ పార్టీ(బీఎస్పీ) అధినేత మాయవతికి బుందేల్‌ఖండ్, నాట్‌పురా గ్రామాల్లో ఆలయాలు ఉన్నాయి. ఆమె నాయకత్వంలో గణనీయమైన సామజిక మార్పు జరిగిందిని, అణగారిని వర్గాల కోసం ఎంగానో కృషి చేసినందుకుగానూ ఆమె మద్దతుదారులు, దళితలు ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో మాయవతి సంప్రదాయ దుస్తుల్లో ఉన్న విగ్రహం ఉంటుంది. ఇక్కడ ఆమె పుట్టిన రోజులు, ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తారు ప్రజలు.
అలాగే నాట్‌పురా గ్రామంలో మాయవతికి గుడి కట్టించారు. కుల వివకక్షకు వ్యతిరేకంగా సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన కృషికి గుర్తుగా ఈ ఆలయాన్ని నిర్మించారు అభిమానులు. అక్కడి ప్రజలకు ఆమెను పూజించడం వల్ల తమకు మానసిక ధైర్యం వస్తుందని, ఇది తమకు సామాజిక సవాళ్లను అధిగమించగల ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
మహాత్మా గాంధీ
జాతిపితా మహాత్మాగాంధీని భారతదేశం అంతటా గౌరవిస్తారు. కానీ ఒడిశాలోని సంబల్‌పూర్‌లో ఆయనకు ఆలయం నిర్మించి మరీ పూజలు చేస్తున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ ప్రజలు ఆయనను పూజింటమే గాక, ఆయన చెప్పిన అహింస, సత్యం, స్వావలంబన వంటి వాటిని పాటిస్తారు కూడా.
ఈ ప్రాంతం గాంధేయ తత్వాన్ని వ్యాప్తి చేసే కేంద్రంగా పనిచేస్తుంది. సందర్శకులు ఈ ఆలయంలో ఉన్న గాంధీని ఒక సాధువుగా చూస్తారు. ఆయన బోధనలు నేటికి అక్కడ వినిపిస్తుంటాయి. ఆ ఆలయం కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు, ఇది సమాజంలో శాంతి, సామరస్యాన్నిపెంపొందించే సామాజిక, విద్యా కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.
రాజీవ్ గాంధీ..
ఆయన దేశాన్ని ఆధునికరించడానికి చేసిన కృషికి గుర్తుగా బిహార్‌లోని రాజీవ్ మద్దతుదారులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రజలు నివాళులు అర్పించడమే గాక ప్రగతిశీల భారతదేశం కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకుని, ప్రేరణ పొందుతామని చెన్నారు. భారత్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుంది.
బిహార్‌లోని ప్రజలు ఈ ఆలయాన్ని దర్శించి వారి జ్ఞాపకాలను నెమరువేసుకోవడమే గాక రాజీవ్ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటుంటారు. ఆయన నాయకత్వంలో తీసుకొచ్చిన విధానాలు గ్లోబల్ ఐటీ పవర్‌హౌస్‌గా మార్చడంలో సహాయపడ్డాయని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు.
ఎంజీఆర్
ప్రముఖ నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌కి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఆయన జ్ఞాపకార్థం పలు ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలను చూస్తే.. ప్రజలతో ఆయనకు గల అవినాభావ సంబంధం తెలియజేస్తాయి. ముఖ్యంగా చెన్నైలోని ఆలయం మరింత పేరుగాంచింది.
ఇక్కడ ఎంజీఆర్ జీవిత పరిణామక్రమానికి సంబంధించిన విషయాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. ఎంజీఆర్ స్ఫూర్తి.. తమకు మార్గనిర్దేశం చేసి కాపాడుతుందని ఆయన అనుచరుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయాల్లో ఆయన జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. అంతేగాదు ప్రజలు తమ ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఇక్కడకు తరుచుగా వస్తుంటారు కూడా.
(చదవండి: ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?)
Comments
Please login to add a commentAdd a comment