
రిలయన్స్ ఇండిస్ట్రీస్ అధినేత, బిలియనీర్ ముకేశ్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న అంగరంగ వైభవంగా జరగనుంది. అందుకు సంబంధించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్స్ గ్రాండ్‌గా నిర్వహించేందకు అంబానీ కుటుంబం రెడీ అయిపోయింది. వచ్చే నెల మార్చి 1వ తేదీ నుంచి మార్చి 3 వరకు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకల ఘనంగా జరగనున్నాయి.
అందులో భాగంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న భారీ ఆలయ సముదాయంలో 14 కొత్త ఆలయాలను నిర్మించింది అంబానీ కుటుంబం. ఇక్కడ ఎంతో అందంగా చెక్కిన స్తంభాలు, దేవతల శిల్పాలు, ఫ్రెస్కో శైలి పెయింటింగ్స్ ఉన్నాయి. తరతరాలుగా వచ్చిన నిర్మాణ శైలులను ప్రతిబింబించేలా సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్నాయి. జామ్ నగర్‌లోని మోతీ ఖావ్డి వద్ద ఉన్న ఆలయ సముదాయంలో ప్రముఖ శిల్పులు, స్థానిక కళాకారుల సహకారంతో ఈ దేవాలయాలను సర్వాంగ సుందరంగా రూపొందించారు.
ఈ ఆలయాల్లో శిల్పాలను, స్థంభాలను చెక్కిన తీరు భారతదేశ శిల్పకళాకారుల అసామాన్యమైన నైపుణ్యం, అంకితభావాన్ని నిలువెత్తు నిదర్శంగా ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్ పర్సన్ నీతా అంబానీ భారతీయ వారసత్వం, సంప్రదాయం, సంస్కృతిని పరిరక్షించడం, ప్రోత్సహించడం అనే విజన్‌కు అనుగుణంగా స్థానిక కళాకారులు అద్భుతంగా ఈ ఆలయాలను నిర్మించారని ప్రశంసించారు . అంతేగాదు ఆ ఆలయాలను సందర్శించి అక్కడి కళారూపాలను చూసి ముగ్దులైపోవడమే గాక ఆ శిల్పకారుల పని తీరును కొనియాడారు నీతా అంబానీ.
వారి నైపుణ్యంతో ఆయా ఘట్టాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వివాహానికి ముందే ఈ ఆలయాలు ఇంత అందంగా రూపుదిద్దుకోవడం తమ ఇంట జరగనున్న వివాహ వేడుకకు మంచి శుభారంభంమని అన్నారు. ఇంకోవైపు.. జామ్‌నగర్‌లో జరగబోయే వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అతిరథ మహారథులు హాజరవుతున్నారు. రజినీ కాంత్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి నటులతో పాటు ఫేస్ బుక్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మోర్గాన్ స్టాన్లీ సీఈఓ టెడ్ బిక్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, అడ్నోక్ సీఈఓ సుత్లాన్ అహ్మద్ అల్ జాబర్ వంటి దిగ్గజ వ్యాపారవేత్తలు వస్తున్నారు. అలాగే అంతర్జాతీయ కళాకారులు ఈ వివాహ వేడుకలకు హాజరవనున్నారు.
(చదవండి: అంబానీ ఇంట పెళ్లికి షారూఖ్ పెర్ఫార్మెన్స్? ఫీజు అన్ని కోట్లా?)
Comments
Please login to add a commentAdd a comment