గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది | Woman Body In Sack Found At Mumbai Beach Identified | Sakshi
Sakshi News home page

గోనె సంచిలో మహిళ శవం.. ఎవరిదో తెలిసింది

Published Sat, Dec 26 2020 6:46 PM | Last Updated on Sat, Dec 26 2020 6:55 PM

Woman Body In Sack Found At Mumbai Beach Identified - Sakshi

నందిని పంకజ్‌ రాయ్

ముంబై : కొద్దిరోజుల క్రితం ముంబైలోని అక్ష బీచ్‌లో గోనె సంచిలో దొరికిన శవం ఎవరిదో పోలీసులు గుర్తించారు. మృతురాలు ఈస్ట్‌ కాందివ్లీ, పోయిసర్‌కు చెందిన నందిని పంకజ్‌రాయ్‌(22)గా తేలింది. కేసు వివరాల్లోకి వెళితే.. నందిని.. భర్త, మామతో కలిసి ముంబైలోని కాందివ్లీలో నివాసం ఉంటోంది. డిసెంబర్‌ ప్రారంభంలో ఆమె భర్త సొంతూరుకు వెళ్లాడు. నందిని, మామతో కలిసి ఇంట్లోనే ఉంటోంది. అయితే కొద్దిరోజుల తర్వాత నందిని తల్లిదండ్రులు ఆమె సెల్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌ వచ్చింది. డిసెంబర్‌ 8వ తేదీ వరకు ఫోన్‌ చేసి, విసిగిపోయారు. దీంతో ఆమె తండ్రి కాందివ్లీలోని ఇంటికి వెళ్లాడు. (2019లో చనిపోయి.. 2020లో బ్రతికొచ్చింది!)

ఇంటికి తాళం వేసి ఉంది. చుట్టు ప్రక్కల వారిని అడిగి చూశాడు. ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్‌ కేసుతో రంగంలోకి దిగిన పోలీసులకు నందిని మామపై అనుమానం వచ్చింది. శుక్రవారం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫొటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నారు. నందిని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఆమె మరణానికి గల కారణాలు తెలియరానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement