రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!.. | 5 Years Girl Stuffed In Sack And Thrown On Road In Mumbai | Sakshi

రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..

Dec 21 2020 8:31 PM | Updated on Dec 21 2020 9:12 PM

5 Years Girl Stuffed In Sack And Thrown On Road In Mumbai - Sakshi

చిన్నారి రేణు

ముంబై : గుర్తు తెలియని వ్యక్తులు కొందరు ఐదేళ్ల చిన్నారిని గోనె సంచిలో కుక్కి, రోడ్డుపై పడేసిన సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు రేణు అనే పాపను గోనె సంచిలో కుక్కి, వాసాయ్‌లోని ఫాథర్‌వాడి పెట్రోల్‌ పంప్‌ సమీపంలోని రోడ్డుపై పడేశారు. ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అప్పటివరకు మత్తులో ఉన్న పాపకు స్పృహ వచ్చింది. గోనె సంచిలోనుంచి బయటకు రావటానికి ప్రయత్నించసాగింది. ( తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి..)

ఆ రోడ్డుపై వెళుతున్న జనం గోనె సంచి కదలటాన్ని గమనించి, దాన్ని విప్పి చూడగా ఓ చిన్నారి బయటకొచ్చింది. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు పాపను వివరాలు అడగ్గా.. తన పేరు రేణు అని, తల్లిదండ్రుల పేర్లు గోపాల్‌, గాయత్రి అని చెప్పింది. ఇంటి అడ్రస్‌ చెప్పలేకపోయింది. పోలీసులు రేణును దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పాప తల్లిదండ్రుల కోసం విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Video

View all
Advertisement