ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి | British bank employees sacked for filming IS-style execution | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి

Published Tue, Jul 7 2015 6:17 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి

ఉగ్రవాదుల్లా చేసినందుకు ఉద్యోగాలు ఊడాయి

లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎలా ఉరితీస్తారో అలాంటి చర్యనే మాక్గా నిర్వహించినందుకు ఆరుగురు ఉద్యోగులను బ్రిటన్కు చెందిన ఓ బ్యాంక్ తొలగించింది. వీరంతా కూడా ఆసియా వాసులే కావడం గమనార్హం. హెచ్ఎస్బీసీ బ్యాంక్లో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల మాదిరిగా ఓ ఎనిమిది నిమిషాల వీడియో రూపొందించి దానిని ఆన్లైన్లో పెట్టారు.

దాని ప్రకారం ఐదుగురు వ్యక్తులు నల్లటి దుస్తులు ధరించి నవ్వుతుండగా మరో వ్యక్తికి ఆరెంజ్ దుస్తులు వేసి మొకాళ్లపై కూర్చుబెట్టారు. అందులో ఒకరు 'అల్లాహు అక్బర్' అని గట్టిగా కేక వేయగా మొకాళ్లపై నిల్చున్న వ్యక్తి మెడపై ఫేక్ కత్తిని ఉంచారు'. ఈ వీడియో బయటకుపొక్కడంతో బ్యాంకు అధికారులు తీవ్రంగా స్పందించారు. ఇలాంటి చర్యను తాము ఏమాత్రం సహించేది లేదని, వారందరిని తొలగించాలని నిర్ణయించామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement