Misconduct
-
ఆర్జీ కర్ మాజీ ప్రిన్సిపల్‌కు ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీ
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ హాస్పిటల్లో ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌తో పాటు మరో ముగ్గురు నిందితులకు కోల్‌కతా కోర్టు ఎనిమిది రోజల సీబీఐ కస్టడీ విధించింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడిన కేసులో సందీప్ ఘోషతో పాటు, మరో ముగ్గురు నిందితులు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా, అఫ్సర్ అలీ ఖాన్‌లను సోమవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇవాళ వారిని సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించింది. ఇప్పటికే కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసులో సందీప్ ఘోష్ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఈ కేసులో విచారించడానికి నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోల్‌కతా కోర్టును కోరింది. అయితే కోర్టు ఎనిమిది రోజులు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఇందులో ఒక నిందితుడైన అఫ్సర్ అలీ బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద సందీప్ ఘోష్‌పై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుపై కోల్‌కతా పోలీసులు సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేసినప్పటికీ కలకత్తా హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో సోమవారం సీబీఐ సోదాలు జరిపి అనంతరం అరెస్ట్ చేసింది. -
భారతీయ యాసను వెక్కిరించిన కానిస్టేబుల్
లండన్: ఫిర్యాదు చేసేందుకు ఫోన్ చేసిన ఒక మహిళ భారతీయ యాసను వెక్కిరించిన పోలీస్ కానిస్టేబుల్‌ను బ్రిటన్ క్రమశిక్షణా ట్రిబ్యూనల్ విధుల నుంచి తప్పించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీ జరిగిన ఘటన తాలూకు కేసులో పోలీసు ప్యాట్రిక్ హ్యారిసన్‌ను దోషిగా తేలుస్తూ లండన్‌లోని ట్రిబ్యూనల్ తీర్పుచెప్పింది. గత నెలలో తీర్పువెలువగా వివరాలు తాజాగా బహిర్గతమయ్యాయి. వెస్ట్ యార్క్‌షైర్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేసే ప్యాట్రిక్ ఘటన జరిగిన రోజు లండన్‌లోని ఫోర్స్ కాల్సెంటర్లో విధుల్లో ఉన్నాడు. తనపై ఒకరు విద్వేష నేరానికి పాల్పడ్డారంటూ ఒక మహిళ ఈ కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదుచేసింది. ఫిర్యాదును పట్టించుకోకుండా ప్యాట్రిక్ ఆమె మాట్లాడే భారతీయ యాసను వెక్కిరించడం మొదలెట్టాడు. అసలది విద్వేష నేరమని ఎందుకు అనుకుంటున్నావ్? అని భారతీయ యాసను అనుకరిస్తూ వెటకారంగా మాట్లాడాడు. ఫోన్ కట్‌చేశాక ఆమె ఫిర్యాదుచేస్తుందేమోనని భయపడ్డాడు. ఆమెకు వేరే నంబర్ నుంచి ఫోన్ చేసి ఆమె ఏం అనుకుందోనని ఆరాతీశాడు. ప్యాట్రక్ చర్యతో విసిగిపోయిన ఆమె ‘టెల్ మామా’కు ఫిర్యాదుచేసింది. బ్రిటన్‌లో ముస్లింవ్యతిరేక ఘటనలపై ప్రభుత్వం ‘టెల్ మామా(ఎంఏఎంఏ–మెజరింగ్ యాంటీ ముస్లిం అటాక్స్) ప్రాజెక్ట కింద చర్యలు తీసుకుంటోంది. ఈ ఉదంతంలో ప్యాట్రిక్ వైఖరిని ట్రిబ్యూనల్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘15 ఏళ్లపాటు విధుల్లో ఉంటూ కూడా అధికారం, హోదాను మరిచి మహిళతో అనుచితంగా మాట్లాడాడు. ఈయన వైఖరితో ప్రజల్లో పోలీసుల పట్ల నమ్మకం, విశ్వాసం తగ్గిపోతాయి. ఇది మొత్తం పోలీసు వ్యవస్థకే అప్రతిష్ట. జాతి వివక్ష, ఇస్లామోఫోబియా దేశవ్యాప్తంగా పోలీసుల్లో గూడుకట్టుకోవడం ఆందోళనకరం’’ అని ట్రిబ్యూనల్ ఆగ్రహం వ్యక్తంచేసింది. అతడిని విధుల నుంచి తప్పించింది. -
రాసలీలల స్కాం: WWE చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన మెక్‌మ్యాన్
ప్రపంచంలోనే అత్యధిక బుల్లితెర వీక్షణ ఉన్న రియాలిటీ ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్ షో డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ షో నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్, సీఈవో విన్స్ మెక్‌మ్యాన్(76) తన పదవుల నుంచి వైదొలిగారు. రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఉద్యోగితో ఎఫైర్ నడిపిన విన్స్.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు ఈమధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ దరిమిలా తన సీఈవో, చైర్మన్ పదవులకు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు విన్స్ మెక్‌మ్యాన్ ప్రకటించారు. మాజీ ఉద్యోగిణితో ఎఫైర్ గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు విన్స్ మెక్‌మ్యాన్ డబ్బు ఇచ్చాడని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు దర్యాప్తు ఏప్రిల్‌లోనే మొదలైందని, దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఆ కథనం సారాంశం. మెక్మ్యాన్తోపాటు డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్ రిలేషన్స్ హెడ్‌గా ఉన్న జాన్ లారినైటిస్ మీద కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరి మీద ప్రత్యేక కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోందని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు చైర్మన్, సీఈవో బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రియేటివ్ కంటెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్)లో మాత్రం విన్స్ మెక్‌మ్యాన్ జోక్యం ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌మ్యాన్ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్మ్యాన్కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది దర్యాప్తు కమిటీ. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్ కెనెడీ మెక్‌మ్యాన్.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగాడు. విన్స్మెక్మ్యాన్ భార్య లిండా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలక బాధత్యలు నిర్వహించారు. ఇక మెక్‌మ్యాన్ కొడుకు షేన్ మెక్‌మ్యాన్, కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్, అల్లుడు ట్రిపుల్ హెచ్(పాల్ మైకేల్ లెవెస్క్యూ) కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రెజర్లుగానే కాకుండా.. కంపెనీ బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూడబ్ల్యూఈలో విన్స్ మెక్మ్యాన్పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చినా.. ఇప్పుడు వృత్తిపరమైన నియమావళికి సంబంధించినవి కావడంతో విన్స్ మెక్‌మ్యాన్ తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చింది. -
సింగర్‌పై యంగ్ హీరో లైంగిక దాడి, అరెస్ట్ చేసిన పోలీసులు
The Flash Actor Ezra Miller Arrested On Harassment, Misconduct Charges: జస్టిస్ లీగ్, ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ యంగ్ హీరో ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా హవాయిలోని ఓ బార్లో జరిగిన పార్టీలో మిల్లర్ పాల్గొన్నాడు. అక్కడ 23 ఏళ్ల ఓ యువతి సాంగ్స్ పాడుతుండగా మిల్లర్ స్టేజ్ పైకి ఎక్కి ఆమెతో అసభ్య పదజాలంతో ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆమె ఒంటిపై చేతులు వేస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడిని అడ్డుకోవడానికి వచ్చిన మేనేజర్ కూడా దాడికి యత్నించాడు. ఇక మిల్లర్‌కు సదరు యువతి ఎదురు తిరగడంతో ఆమె చేతిలో ఉన్న మైక్రోఫోన్‌ని లాక్కొని అసభ్యంగా దూషించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బార్ యాజమాన్యం మిల్లర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు 500 డాలర్లు జరిమానా విధించారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కాగా యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే హిట్స్ అందుకుంటున్న మిల్లర్ ఇలా ప్రవర్తించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
వివాహేతర సంబంధాన్ని దుష్ప్రవర్తనగా పరిగణించలేం!: కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు
Court Cancels Cop’s Sacking: సమాజ దృక్కోణం నుంచి వివాహేతర సంబంధాన్ని "అనైతిక చర్య"గా చూడగలిగినప్పటికీ, దానిని "దుష్ప్రవర్తన"గా పరిగణించలేమని గుజరాత్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు కానిస్టేబుల్ తన కుటుంబంతో కలిసి నివసించే పోలీస్ హెడ్‌క్వార్టర్‌లోనే వితంతువుతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నందుకు తనను సర్వీస్ నుంచి తొలగించడంతో అతను సవాలు చేస్తూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశాడు. "అయితే పిటిషనర్ క్రమశిక్షణలో భాగంగా వివాహేతర సంబంధం దుష్ప్రవర్తనే. సమాజం దృష్టిలో కూడా వివాహేతర సంబంధం అనైతిక చర్యే అయినప్పటికీ వాస్తవాన్ని పరిగణలోకి తీసుకుంటే దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురావడం ఈ కోర్టుకు కష్టమవుతుంది. ఎందుకంటే ఇది అతని వ్యక్తిగత వ్యవహారమని బలవంతపు ఒత్తిళ్లు లేదా దోపిడీ ఫలితంగా కాదు అని" కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాదు ప్రవర్తనా నియమాలు 1971 ప్రకారం దుష్ప్రవర్తన పరిధిలోకి తీసుకురాలేం అని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాదు అతన్ని ఒక నెలలోపు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అతను విధుల నుంచి తొలగించబడినప్పటి నుంచి అతని వేతనంలో 25 శాతం చెల్లించాలని జస్టిస్ సంగీతా విషెన్ సంచలన తీర్పు వెలువరించారు. మరోవైపు పిటిషనర్ కానిస్టేబుల్ తన అభ్యర్థనలో సంబంధం ఏకాభిప్రాయమని, ప్రతిదీ తమ స్వంత ఇష్టపూర్వకంగా జరిగిందని వాదించాడు. అంతేకాదు పోలీసు డిపార్ట్మెంట్ సరైన విచారణ ప్రక్రియను అనుసరించలేదని, తనను తొలగిస్తూ వచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు సదరు మహిళతో కానిస్టేబుల్ అక్రమ సంబంధానికి సంబంధించిన సీసీఫుటేజ్‌ని 2012లో నగర పోలీసు ఉన్నతాధికారులకు అందించి మరీ వితంతువు కుటుంబం అతని పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతనికి షోకాజ్ నోటీసులు పంపారు. ఆ జంట కూడా సంబంధాన్ని అంగీకరించడంతో పోలీసులు విచారణ చేయడం ఇరు పార్టీలను ఇబ్బంది పెట్టడమే అవుతుందని భావించి పూర్తి విచారణ జరపలేదు. ఆ తర్వాత జాయింట్ పోలీస్ కమీషనర్ అతను డిపార్ట్మెంట్లో కొనసాగితే ప్రజలకు పోలీస్‌శాఖ పై విశ్వాసం సన్నగిల్లుతుందంటూ 2013లో అతన్ని విధుల నుంచి తొలగించారు. అయితే కోర్టు మాత్రం విచారణ జరపకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించి రద్దు చేసి పక్కన పెట్టిందని ఉత్తర్వులో పేర్కొంది. అంతేకాదు పోలీసు సర్వీస్ నిబంధనల చట్టం ప్రకారం ఒక పోలీసును తొలగించడానికి ఇది కారణం కాదని, పైగా అది అతని వ్యక్తిగత వ్యవహారమని కోర్టు స్పషం చేసింది. (చదవండి: రవిదాస్ దేవాలయంలో ప్రార్థనలు చేసిన మోదీ) -
వారిపై రాచకొండ సీపీ శాఖ పరమైన చర్యలు
సాక్షి, యాదాద్రి: విధి నిర్వహణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కొరడా ఝుళిపించారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్లను నిందితులకు సహకరించారని.. భూ వివాదాలు, వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిని పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే వివిధ కారణాలు, సాధారణ బదిలీల్లో పలువురికి శుక్రవారం స్థానచలనం కలిగింది. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారని.. పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారన్న ఆరోపణలతో ఇద్దరు పోలీసులపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి, బీబీనగర్ పోలీస్‌స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్‌ను హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్న పేలుడు పదార్థాల కేసులో నిందితుల పేర్లు మార్చేందుకు, మరో నిందితుడు సోమ రామకృష్ణకు ముందస్తు బెయిల్ రావడానికి సహకరించేందుకు యత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరిపై చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. విశ్వసనీయ సమాచారం మేరకు భువనగిరి మండలం కూనూరు వద్ద ఈ నెల 18న రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న జిలిటిన్‌స్టిక్స్, డిటోనేటర్లు, అమోనియం నైట్రేట్లను ఎస్ఓటీ సీఐ రంగస్వామి ఆధ్వర్యంలో పోలీస్‌లు పట్టుకున్నారు. ట్రాన్స్‌పోర్టుకు చెందిన వాహనం, బొలేరో వాహనంలో వీటిని తరలిస్తున్నారు. ఆలేరుకు చెందిన రాంపల్లి విక్రం, బొందుగులకు చెందిన రాంగోపాల్‌రెడ్డి, భువనగిరికి చెందిన సోమ రామకృష్ణలతోపాటు మరో ఆరుగురిని కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. పట్టుకున్న పేలుడు పదార్థాల వాహనాలతోపాటు నిందితులను ఎస్ఓటీ పోలీసులు భువనగిరి రూరల్ సీఐ సురేందర్‌రెడ్డికి అప్పగించారు. అనంతరం వాహనాల్లోని సామగ్రిని సీఐ పరిశీలించగా జిలిటిన్‌స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు తేలింది. లారీలో పేలుడు సామగ్రిని తరలిస్తున్న ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరిని సీఐ అదుపులోకి తీసుకున్నారు. బీబీనగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా.. సీఐ అంతకు ముందే లారీ పట్టుబడ్డ విషయం ట్రాన్స్‌ఫోర్టు యాజమానికి ఓహెడ్ కానిస్టేబుల్ ద్వారా చేర వేశారు. దీంతో సంబంధిత ముగ్గురు ఓనర్లు సీఐతో బేరసారాలు కుదుర్చుకున్నట్లు సమాచారం. దీంతో కేసులో యాజమాన్యానికి సహకరించేందుకు సీఐ నిబంధనలకు విరుద్ధంగా భువనగిరి స్టేషన్లో కాకుండా పరిధి దాటి తనకు అనుకూలంగా ఉన్న బీబీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్ఓటీ అధికారి ఫిర్యాదుతో.. పెద్ద ఎత్తున పట్టుబడ్డ పేలుడు పదార్థాల కేసులో నిందితులను అరెస్ట్ చేయకుండా, వారికి సహకరిస్తున్నారని ఎస్ఓటీ అధికారి.. రాచకొండ సీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో సీపీ విచారణకు ఆదేశించారు. భువనగిరిలో కేసు నమోదు చేయాల్సి ఉండగా బీబీనగర్‌లో ఎందుకు పెట్టారనే కోణంలో దర్యాప్తు చేపట్టగా పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అమోనియం నైట్రేట్ సరఫరా చేస్తున్న సోమ రామకృష్ణతోపాటు మరికొందరు నిందితుల పేర్లు కేసులో లేకుండా తప్పించాడన్న కోణంలో ఒక వైపు, నాన్‌బెయిలబుల్ కేసులో రామకృష్ణను అరెస్ట్ చేయాల్సి ఉండగా ముందస్తు బెయిల్ తీసుకొమ్మని నిందితునికి సీఐ సలహా ఇచ్చి అరెస్ట్ చేయకుండా జాప్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటిలిజెన్స్ విచారణలో సైతం ముందస్తు బెయిల్ కోసం సీఐ సహకరిస్తున్నాడన్న విషయం విచారణ అధికారులు గుర్తించి సీపీకి నివేదిక ఇవ్వడంతో వెంటనే చర్యలు తీసుకున్నారు. కాగా ఏడాది క్రితం సీఐగా ఇక్కడికి వచ్చిన సురేందర్‌రెడ్డి గతంలో భువనగిరి రూరల్ ఎస్ఐగా పని చేస్తూ వివాదాల నేపధ్యంతో బదిలీపై వెళ్లారు. మరోవైపు సురేందర్‌రెడ్డికి హెడ్‌కానిస్టేబుల్ కరుణాకర్ సన్నిహితుడిగా ఉన్నాడు. దఫేదార్‌గా కరుణాకర్ చేసిన వసూళ్లపై ఫిర్యాదు అందడంతో సీపీకి అటాచ్ చేయగా 6నెలల క్రితం ఇదే స్టేషన్లో విధుల్లో చేరాడు. కాగా ఇదే సంవత్సరం మార్చి 10న అప్పటి భువనగిరి జోన్ డీసీపీ రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణ ఇన్స్పెక్టర్ వెంకన్నలు సిట్ పరి«ధిలో ఉన్న గ్యాంగ్‌స్టర్ నయీమ్ చెందిన భూముల రిజిస్ట్రేషన్ కేసు నీరుగార్చారని అటాచ్ చేయడం పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆలేరు ఎస్ఐపై.. భూ వివాదాలు, అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆలేరు ఎస్ఐ జె.వెంకట్‌రెడ్డిపై కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాచకొండ సీపీ స్పందిస్తూ శుక్రవారం ఆయనను పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పలువురు పోలీసు అధికారుల బదిలీ శుక్రవారం జిల్లాలో పలువురు పోలీసులు బదిలీ అయ్యారు. యాదగిరిగుట్ట పట్టణ ఇన్స్పెక్టర్ నర్సింహారావు బదిలీ కాగా ఇ క్కడికి మహబూబ్‌నగర్ జిల్లానుంచి పాండురంగారెడ్డి వచ్చారు. ఆత్మకూర్(ఎం) ఎస్ఐ తుర్కపల్లికి, తుర్కపల్లి ఎస్ఐ వెంకటయ్య ఆత్మకూర్(ఎం)కు, యాదగిరిగుట్ట ఎస్ఐ రమేశ్‌ను ఆలేరుకు బదిలీ చేశారు. నిందితులకు సహకరించారనే చర్యలు పేలుడు పదార్థాల కేసులో నిందితులకు సహకరించారనే సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశాం. జిలెటిన్ స్టిక్, డిటోనేటర్లు, అమోనియం అక్రమ రవాణాలో నిందితులకు ముందస్తు బెయిల్‌కు సహకరించారు. ఈ కేసులో విచారణ జరుగుతోంది. –నారాయణరెడ్డి, డీసీపీ -
డెలాయిట్పై ఐదేళ్ల నిషేధం?
ముంబై: ప్రభుత్వ రంగ ఆర్థిక సేవల సంస్థ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో చోటుచేసుకున్న భారీ రుణ కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు సంస్థలు కొరడా ఝళిపిస్తున్నాయి. ఈ కేసులో అంతర్జాతీయ ఆడిటింగ్ దిగ్గజం డెలాయిట్ కూడా అవకతవకలకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థపై నిషేధం విధించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల ఆడిటింగ్ ప్రక్రియ విషయంలో డెలాయిట్ అక్రమాలకు పాల్పడిందని కేసును దర్యాప్తు చేస్తున్న తీవ్ర ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ(ఎస్ఎఫ్ఐఓ) నిగ్గు తేల్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. దీంతో కంపెనీల చట్టంలోని 140(5) సెక్షన్ ప్రకారం డెలాయిట్పై నిషేధం విధించేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాయత్తం అవుతోందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.91,000 కోట్ల రుణాల ఊబిలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ కంపెనీలు.. బకాయిలు తీర్చలేక చేతులెత్తేసిన(డిఫాల్ట్) సంగతి తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం కంపెనీని తన అధీనంలోకి తీసుకోవడంతోపాటు చోటుచేసుకున్న అక్రమాలపై దర్యాప్తు ఏజెన్సీలతో విచారణను వేగవంతం చేసింది. కాగా, ఈ ఉదంతంపై డెలాయిట్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఫైనాన్షియల్ సర్వీస్(ఐఎఫ్ఐఎన్)పై దర్యాప్తునకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని.. ఆడిటింగ్ ప్రమాణాలు, ఇతరత్రా చట్టాలు, నిబంధనలకు లోబడే తాము ఆడిట్‌ను నిర్వహించామని పేర్కొన్నారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు మొత్తం 347 అనుబంధ సంస్థలు ఉండగా.. ఇందులో మెజారిటీ కంపెనీలకు చిన్నాచితకా ఆడిట్ సంస్థలే ఆడిటింగ్‌ను నిర్వహించాయని కూడా డెలాయిట్ అంటోంది. అంతేకాకుండా గ్రూప్‌లో రెండు ప్రధాన కంపెనీలైన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్టేషన్ నెట్వర్క్స్కు ఎర్నెస్ట్ అండ్ యంగ్ పార్ట్నర్ అయిన ఎస్ఆర్బీసీ అండ్‌కో 2017–18, 2018–19లో ఆడిట్ చేపట్టిందని పేర్కొంది. అదేవిధంగా ఐఎఫ్‌ఐఎన్‌కు 2018–19లో కేపీఎంజీ పార్ట్నర్ అయిన బీఎస్ఆర్ ఆడిట్ చేపట్టిందని వెల్లడించింది. చాలా ఏళ్లుగా తాము ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ ఆడిటింగ్ చేస్తున్నామని.. చాలా వరకూ రుణాలకు తగినంత తనఖాలు ఉన్నాయనేది డెలాయిట్ వాదన. నైట్‌ఫ్రాంక్ వంటి సంస్థలతో దీనిపై స్వతంత్ర వేల్యుయేషన్ కూడా జరిగిందని అంటోంది. నిషేధం ఎన్నాళ్లు... సత్యం స్కామ్‌లో ఇప్పటికే ఒక అంతర్జాతీయ ఆడిట్ అగ్రగామి ప్రైస్ వాటర్‌హౌస్(పీడబ్ల్యూ)పై 2018లో సెబీ రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా పీడబ్ల్యూకు చెందిన రెండు పార్ట్నర్ సంస్థలను మూడేళ్లు నిషేధించారు. ఇప్పుడు డెలాయిట్‌పైనా ఇదే తరహా కొరడా ఝళిపిస్తే.. నిషేధాన్ని ఎదుర్కొన్న రెండో అంతర్జాతీయ ఆడిట్ సంస్థగా నిలవనుంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ఖాతాల్లో చోటుచేసుకున్న తీవ్రమైన ఆర్థిక అవకతవకలను కావాలనే చూసీచూడనట్లు వదిలేసినట్లు డెలాయిట్పై అంతర్గత వేగు(విజిల్‌బ్లోయర్) ఎస్‌ఎఫ్‌ఐఓకు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్‌లో సంక్లిష్టతను ఆసరాగా చేసుకుని ఎగ్జిక్యూటివ్‌లతో డెలాయిట్ కుమ్మక్కయిందని.. ఇందుకుగాను భారీగా ఫీజులు, కాంట్రాక్టులను దక్కించుకుందనేది విజిల్‌బ్లోయర్ ఆరోపణ. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ మాజీ చీఫ్ రవి పార్థసారథి అక్రమాలకు డెలాయిట్ దన్నుగా నిలిచిందని కూడా లేఖలో సంచలన ఆరోపణలు ఉన్నాయి. గతవారంలో డెలాయిట్ మాజీ సిఈఓను ఈ కేసులో ఎస్ఎఫ్ఐఓ విచారించింది. డెలాయిట్పై ఈ ఆరోపణలు రుజువైతే ఐదేళ్ల వరకూ నిషేధాన్ని విధించొచ్చని కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
హోటల్‌కు రాలేదని.. క్రికెటర్‌పై నిషేధం
కొలంబో: నిబంధనలు ఉల్లంఘించిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ జేఫ్రీ వాండెర్సేపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. ఏడాది నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా సెయింట్ లూసియాలో జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రీలంక జట్టు ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్లారు. కానీ ఈ యువ ఆటగాడు మాత్రం రాత్రంతా హోటల్‌కు రాకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఆగ్రహించి మూడో టెస్టు నుంచి తప్పించి ఇంటికి పంపించింది. ఈ ఘటనపై ఆగ్రహించిన శ్రీలంక క్రికెట్ బోర్డు వాండెర్సేపై కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యలను ఎవరు పాటించకున్నా ఇలాంటి శిక్షలే ఉంటాయని ఆటగాళ్లకు బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో కూడా క్రమశిక్షణ పాటించని ఆటగాళ్లపై వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడంతో పాటు ఎక్కువ సమయం పార్టీలో గడిపాడని ధనుష్క గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 2015లో వన్డేల్లో అరంగేట్రం చేసిన జేఫ్రీ వాండెర్సే.. శ్రీలంక తరుపున 11 వన్డేలు, ఏడు టీ20లల్లో ప్రాతినిథ్యం వహించాడు. -
3 నిమిషాలు ముందు వెళ్లాడని జీతం కట్
టోక్యో/కోబె : రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిని, అతి త్వరగా తేరుకుని.. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిన జపాన్ను ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటాయి. అక్కడ నియమాలు, నిబంధనలు పక్కాగా అమలు చేస్తారు. అయితే, ఓ అరవై నాలుగేళ్ల వృద్ధ ఉద్యోగి పట్ల అక్కడి అధికారుల తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది. విరామానికి ముందే లంచ్‌కి వెళ్లాడని సదరు ఉద్యోగికి ఒకరోజు వేతనంలో సగం కోత విధించారు. దాంతో పాటు మీడియా ముందు గురువారం అతనితో క్షమాపణలు చెప్పించారు. కోబె సిటీ అధికార ప్రతినిధి తెలిపిన వివరాలు.. కోబె వాటర్‌వర్క్స్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి లంచ్ విరామానికి (మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు) మూడు నిమిషాలు ముందు బాక్స్ తెచ్చుకోవడానికి వెళ్లాడు. అలా అతను 7 నెలల కాలంలో 26 సార్లు నిబంధనలను అతిక్రమించాడు. ‘ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తూ ఇలా చేయడం నిజంగా విచారకరం’అంటూ మీడియా సమావేశంలో డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. అయితే ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మీరు మాటిమాటికి సిగరెట్ తాగడానికి వెళితే అప్పుడు నిబంధనల ఉల్లంఘన గుర్తుకు రాదా అని అధికారుల తీరుపై కొందరు ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ వాలకం చూస్తుంటే టాయ్‌లెట్‌కు కూడా పోనిచ్చేలా లేరని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. కాగా, లంచ్ విరామంలో కాకుండా పని వేళల్లో భోజనానికి వెళ్తున్నాడనే కారణంతో ఫిబ్రవరిలో ఓ ఉద్యోయోగిని నెల రోజుల పాటు విధుల నుంచి తొలగించారు. -
మహిళా ఎంపీలపై సహచరుల అనుచిత ప్రవర్తన
టొరొంటో: కెనడాలో మహిళా ఎంపీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేశారు. లిబరల్ పార్టీ ఎంపీలు స్కాట్ ఆండ్రూస్, మాసిమో పాసిట్టిపై వేటు వేసినట్టు ఆ పార్టీ నేత జస్టిన్ ట్రుడీ చెప్పారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఇద్దరు మహిళా ఎంపీల ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నారు. కాగా లిబరల్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేసిన మహిళా ఎంపీల పేర్లు బయటకు వెల్లడించలేదు. వీరు న్యూ డెమొక్రటిక్ పార్టీ చెందిన వారని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. మహిళా ఎంపీలు ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించకపోవడంతో వారి పేర్లను గోప్యంగా ఉంచారు. స్కాట్ ఆండ్రూస్, మాసిమో పాసిట్టి వారి ఆరోపణలను ఖండించారు. -
పోలీసు జీపులో విజయమ్మను ఆసుపత్రికి తరలింపు