రంగనా హెరాత్‌తో జేఫ్రీ వాండెర్సే (పైల్ ఫోటో)
కొలంబో: నిబంధనలు ఉల్లంఘించిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ జేఫ్రీ వాండెర్సేపై ఆ దేశ క్రికెట్ బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. ఏడాది నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించారు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా సెయింట్ లూసియాలో జరిగిన రెండో టెస్టు అనంతరం శ్రీలంక జట్టు ఆటగాళ్లు తమకు కేటాయించిన హోటల్‌కు వెళ్లారు. కానీ ఈ యువ ఆటగాడు మాత్రం రాత్రంతా హోటల్‌కు రాకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ ఆగ్రహించి మూడో టెస్టు నుంచి తప్పించి ఇంటికి పంపించింది.
ఈ ఘటనపై ఆగ్రహించిన శ్రీలంక క్రికెట్ బోర్డు వాండెర్సేపై కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణ చర్యలను ఎవరు పాటించకున్నా ఇలాంటి శిక్షలే ఉంటాయని ఆటగాళ్లకు బోర్డు గట్టి వార్నింగ్ ఇచ్చింది. గతంలో కూడా క్రమశిక్షణ పాటించని ఆటగాళ్లపై వేటు వేసింది. ప్రాక్టీస్ సెషన్ ఎగ్గొట్టడంతో పాటు ఎక్కువ సమయం పార్టీలో గడిపాడని ధనుష్క గుణతిలకపై ఆరు మ్యాచ్‌ల నిషేధంతో పాటు అతని కాంట్రాక్టులో 20 శాతం కోత విధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌పై 2015లో వన్డేల్లో అరంగేట్రం చేసిన జేఫ్రీ వాండెర్సే.. శ్రీలంక తరుపున 11 వన్డేలు, ఏడు టీ20లల్లో ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment