కర్నూలు (అగ్రికల్చర్): మీ సేవా కేంద్రాలకు అదనం 151 సర్వీసులు రానున్నాయని జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి వెంకటనారాయణ తెలిపారు. గురువారం మీ సేవా ఆపరేటర్లకు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సీఎస్‌సీ, మీసేవా, డిజిటల్ ఇండియా తదితర వాటిపై మీ సేవా ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మీ సేవా కేంద్రాల ద్వారా దాదాపు 320 సేవలు లభిస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ తదితర వాటికి సంబంధించి 151 సర్వీసులు రానున్నాయని వివరించారు. కొత్త సర్వీసుల నుంచి మాస్టర్ ట్రైనర్లు ఇస్మాయిల్, యశ్వంత్‌లు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డిస్టిక్ట్ మేనేజర్ రాకేష్‌బాబు, డీడీఎం కిషోర్ తదితరులు పాల్గొన్నారు.