
హైదరాబాద్ నుంచి గోఎయిర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : విమానయాన రంగ సంస్థ గోఎయిర్ తాజాగా తన సర్వీసులను హైదరాబాద్ నుంచి ప్రారంభిస్తోంది. అక్టోబరు 12 నుంచి ఈ సేవలు మొదలు కానున్నాయి. దీంతో సంస్థకు భాగ్యనగరి 23వ నగరం కానుంది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, భువనేశ్వర్, కోక్‌కత నగరాలకు ప్రతిరోజు నాన్ స్టాప్ సర్వీసులను గోఎయిర్ నడుపనుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌కు ఫ్లైట్స్ ప్రారంభించనుంది. ప్రస్తుతం గోఎయిర్ నుంచి ప్రతిరోజు 144 సర్వీసులు నడుస్తున్నాయి. డిసెంబరు చివరికల్లా ఈ సంఖ్య 184కు చేరుకోనుందని కంపెనీ తెలిపింది.