అయోధ్య: రామనగరి ఆయోధ్యలో నేటి నుంచి (జూలై 1) మరో 20 మంది పూజారులు సేవా విధుల్లో చేరారు. వీరికి బాధ్యతలు అప్పగించే ముందు వివిధ పూజలకు సంబంధించిన శిక్షణ అందించారు. ఇకపై వీరు ఇప్పటికే నియమితులైన పూజారులతో పాటు పూజాదికాలు నిర్వహించనున్నారు. నూతనంగా చేరిన పూజారులకు డ్రెస్ కోడ్ కూడా జారీ చేశారు. రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర సిబ్బందికి కూడా త్వరలోన్ డ్రెస్ కోడ్ జారీ చేయనున్నారు.
ఈ సందర్భంగా సహాయక పూజార్ అశోక్ మాట్లాడుతూ 20 మంది పూజారులకు ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు. అరంతరం నియామక పత్రాలు అందజేశారన్నారు. ఒక్కో ఉన్నతస్థాయి పూజారి దగ్గర కొత్తగా నియమితులైన ఐదుగురు పూజారులు విధులు నిర్వహించనున్నారన్నారు. పూజారులెవరూ ఆండ్రాయిడ్ ఫోన్‌లను ఆలయంలోనికి తీసుకురాకూడదనే నిబంధన విధించారన్నారు.
రామాలయంలో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్ గుప్తా మాట్లాడుతూ కొత్త పూజారులకు శిక్షణ పూర్తయ్యిందని, వీరంతా ఇకపై ఆలయంలో జరిగే పూజాదికాలలో పాల్గొంటారని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరికొన్ని ఆలయాలు నిర్మితం కానున్నాయని, వాటిలో కూడా పూజారుల అవసరం ఉంటుందని అన్నారు. ఆలయ పూజారులకు ప్రత్యేక డ్రెస్ కోడ్ ఇవ్వడం ద్వారా భక్తులు వారిని సులభంగా గుర్తు పట్టగలుగుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment