![RBI imposes fine on 8 co-operative banks - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/30/CO-OPERATIVE-BANKS.jpg.webp?itok=qIrS3xuP)
ముంబై: నియంత్రణా పరమైన నిబంధనలు పాటించని కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎనిమిది సహకార బ్యాంకులపై జరిమానాలు విధించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని మూడు బ్యాంకులు ఉండగా, తెలంగాణా, తమిళనాడు, కేరళ, ఒడిస్సా, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఆర్‌బీఐ జరిమానాకు గురైన బ్యాంకులు ఉన్నాయి. ఈ మేరకు వెలువడిన ప్రకటనల
ప్రకారం...
► ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం సహకార బ్యాంకుపై రూ.55 లక్షల జరిమానా.
► నెల్లూరు కో–ఆపరేటివ్ అర్బన్‌బ్యాంక్‌పై రూ.10 లక్షలు.
► కాకినాడ కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు.
► తెలంగాణ, హైదరాబాద్ దారుసల్లాం సహకార అర్బన్ బ్యాంక్‌పై రూ.10 లక్షలు.
► తమిళనాడు, తిరుచిరాపల్లి, కైలాసపురంలో ఉన్న భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.10 లక్షల జరిమానా.
► కేరళ, పాలక్కాడ్ జిల్లా, ది ఒట్టపాలెం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5 లక్షలు.
► ఉత్తరప్రదేశ్‌లోని నేషనల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌పై రూ.5 లక్షలు.
► ఒడిస్సాలోని కేంద్రపారా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌పై రూ. లక్ష.
Comments
Please login to add a commentAdd a comment