11న ప్రభుత్వ రంగ బ్యాంకు ఆఫీసర్ల సమ్మె!
హైదరాబాద్, బిజినె?స బ్యూరో: సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి ఒకరోజు సమ్మెకు బ్యాంకు ఉద్యోగులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా డిసెంబర్ 11న పీ?సయూ బ్యాంకుల ఆఫీసర్లు ఒకరోజు దేశవ్యాప్త సమ్మె చేయనున్నట్లు ఆలఖ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషనఖ(ఏఐబీవోసీ)ప్రకటించింది. పి.జే నాయక్ కమిటీ సిఫార్సులు గ్రామీణ బ్యాంకింగ్ రంగాన్ని దెబ్బతీసేటట్లు ఉన్నాయని, జ్ఞాన సంగం, ఇంద్రధనస్సు పేరుతో పీ?సయూ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలను విక్రయించడానికి ప్రయత్నిస్తోందని ఏఐబీవోసీ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ బ్యాంకుల నుంచి భారీగా డివిడెండ్లను అందుకుంటున్న కేంద్రం మూలధనం సమకూర్చడానికి మాత్రం ముందుకు రావడం లేదని ?సబీఐ ఆఫీసర్స్ అసోసియేషనఖ హైదరాబాద్ సర్కిలఖ కార్యదర్శి జి.సుబ్రమణ్యం అన్నారు.
ఇప్చడు ఐడీబీఐ బ్యాంకులో మెజార్టీ ప్రభుత్వ వాటాను విక్రయించడాన్ని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇది విజయవంతమైతే మిగిలిన బ్యాంకుల్లోనూ అమలు చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. దీన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది ఆఫీసర్లు ఒక రోజు సమ్మెకు పిలుపు నిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ సమ్మెను ఆపడానికి కేంద్ర కార్మిక శాఖ రంగంలోకి దిగింది. మంగళవారం ఇండియనఖ బ్యాంక్ అసోసియేషనఖ, ఏఐబీవోసీతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశం విఫలమైతే 11వ తేదీ సమ్మె యథాతథంగా కొన సాగుతుందని సుబ్రమణ్యం తెలిపారు.