కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు | Lohia Group plant in Krishnapatnam | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు

Published Thu, Jun 11 2015 1:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM

కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు

కృష్ణపట్నం వద్ద లోహియా గ్రూప్ ప్లాంటు

రూ.500 కోట్ల పెట్టుబడి  కంపెనీ ఎండీమహవీర్ లోహియా
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోల్డ్‌డ్రాప్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న లోహియా గ్రూప్ నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వద్ద ప్లాంటును నెల కొల్పనుంది. మొత్తం రూ.500 కోట్లు వ్యయం చేయాలని కంపెనీ భావిస్తోంది. స్థలం చేతిలోకి రాగానే 10 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని లోహియా గ్రూప్ ఎండీ మహావీర్ లోహియా తెలిపారు. గోల్డ్‌డ్రాప్ బ్రాండ్ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ప్యాక్‌లతో ఉత్పత్తులను కంపెనీ బుధవారమిక్కడ ఆవిష్కరించింది.
 
 ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ కన్హయాలాల్ లోహియా, ఇతర డెరైక్టర్లతో కలిసి మీడియాతో మా ట్లాడారు. రోజుకు 500 టన్నుల సామర్థ్యంతో కొత్త ప్లాంటు రానుందని చెప్పారు. ‘కంపెనీకి ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్లు హైదరాబాద్ వద్ద 2, కాకినాడ వద్ద ఒకటి ఉంది. వీటి సామర్థ్యం రోజుకు 1,400 టన్నులు. ముడి నూనెల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడాల్సి రావడంతో ఒప్పంద వ్యవసాయం ద్వారా పామాయిల్, పొద్దుతిరుగుడు సాగులోకి వచ్చే ఆలోచన ఉంది. 2014-15లో రూ.2,200 కోట్ల టర్నోవర్ సాధించాం. ఈ ఏడాదిలో రూ.3,000 కోట్లు ఆశిస్తున్నాం’ అని తెలిపారు. రానున్న రోజుల్లో నూనెల ధరలు పెద్దగా పెరగకపోవచ్చని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement