రైల్వే జీఎం గుప్తా రాక నేడు | Railway GM to visit Krishnapatnam today | Sakshi
Sakshi News home page

రైల్వే జీఎం గుప్తా రాక నేడు

Published Fri, Nov 4 2016 11:13 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

రైల్వే జీఎం గుప్తా రాక నేడు

రైల్వే జీఎం గుప్తా రాక నేడు

  • రైల్వేస్టేషన్ల ముస్తాబు
  • కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు  
  • ముత్తుకూరు :  దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ రవీంద్రగుప్తా శనివారం కృష్ణపట్నంపోర్టుకు వస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జీఎం రాక సందర్భంగా వెంకటాచలం–పోర్టు మధ్య ఉన్న నిడిగుంటపాళెం, కృష్ణపట్నం రైల్వే స్టేషన్లను ముస్తాబు చేశారు. విజయవాడ–గూడూరు «మధ్య రైల్వే శాఖ 3వ రైలుమార్గం మంజూరు చేసింది. త్వరలో రైలు మార్గం నిర్మాణం జరిగే ప్రాంతాలను పరిశీలించే నిమిత్తం జీఎం వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోర్టు ద్వారా రవాణా జరిగే సరుకులు, అవసరమయ్యే సదుపాయాలు, ఆదాయ వనరులు తదితర అంశాలను కృష్ణపట్నంపోర్టు అధికారులతో జీఎం సమీక్ష చేస్తారని తెలియవచ్చింది. 
    కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు మంజూరు 
     కృష్ణపట్నం రైల్వే స్టేషన్‌ సమీపంలో కోళ్లమిట్ట వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌కు గేటు నిర్మించేందుకు అనుమతి లభించిందని రైల్వే వర్గాలు తెలిపాయి. గేటు లేని ఈ రైల్వే క్రాసింగ్‌పై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. 
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement