railway GM gupta
-
రైల్వే జీఎం గుప్తా రాక నేడు
రైల్వేస్టేషన్ల ముస్తాబు కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు ముత్తుకూరు : దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా శనివారం కృష్ణపట్నంపోర్టుకు వస్తున్నట్టు రైల్వే వర్గాలు వెల్లడించాయి. జీఎం రాక సందర్భంగా వెంకటాచలం–పోర్టు మధ్య ఉన్న నిడిగుంటపాళెం, కృష్ణపట్నం రైల్వే స్టేషన్లను ముస్తాబు చేశారు. విజయవాడ–గూడూరు «మధ్య రైల్వే శాఖ 3వ రైలుమార్గం మంజూరు చేసింది. త్వరలో రైలు మార్గం నిర్మాణం జరిగే ప్రాంతాలను పరిశీలించే నిమిత్తం జీఎం వస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా పోర్టు ద్వారా రవాణా జరిగే సరుకులు, అవసరమయ్యే సదుపాయాలు, ఆదాయ వనరులు తదితర అంశాలను కృష్ణపట్నంపోర్టు అధికారులతో జీఎం సమీక్ష చేస్తారని తెలియవచ్చింది. కోళ్లమిట్ట క్రాసింగ్‌కు గేటు మంజూరు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో కోళ్లమిట్ట వద్ద ఉన్న రైల్వే క్రాసింగ్‌కు గేటు నిర్మించేందుకు అనుమతి లభించిందని రైల్వే వర్గాలు తెలిపాయి. గేటు లేని ఈ రైల్వే క్రాసింగ్‌పై సాక్షి దినపత్రికలో పలుమార్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. -
2020 నాటికి కోటిపల్లి రైల్వేలైన్‌కు ఓ రూపు
నరసాపురం : కోటిపల్లినరసాపురం రైల్వేలైన్‌కు 2020 నాటికి ప్రాథమికంగా ఓ రూపు వస్తుందని దక్షణ మధ్య రైల్వే (సికింద్రాబాద్) జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా తెలిపారు. శుక్రవారం నరసాపురం రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి మూడు బ్రిడ్జిల నిర్మాణం ముందుగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. గౌతమి నదిపై రైల్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. వైనతేయి, వశిష్ట నదులపై రైలు వంతెనల నిర్మాణాలపై ఎలాంటి కదలిక లేదన్నారు. ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవ్వడానికే 30, 40 నెలలు పడుతుందని పేర్కొన్నారు. నరసాపురం రైల్ కం బ్రిడ్జి లేదు నరసాపురంలో రైల్ కం వంతెన నిర్మాణ ప్రతిపాదనలు లేవన్నారు. కోటిపల్లి రైల్వేలైన్‌కు సంబంధించి నరసాపురంలో రైల్ కమ్ బ్రిడ్జి లింక్ ఉండదన్నారు. చించినాడ బ్రిడ్జి వద్దే సమాంతరంగా రైల్ బ్రిడ్జి నిర్మించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కడా రైల్కమ్బ్రిడ్జిల ప్రతిపాదనలు లేవని చెప్పారు. అలాగే ఆర్వోబీల నిర్మాణాల ప్రతిపాదనలు కూడా లేవన్నారు. ఆయన వెంటన రైల్వే డీజీఎం (విజయవాడ) అశోక్‌కుమార్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. -
తుని ఘటనతో రైల్వే శాఖ అత్యవసర సమావేశం
- ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రైల్వే జీఎం గుప్తా సాక్షి, హైదరాబాద్ః తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు. ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్ టక్కర్, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.