తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది.
- ఏపీ సీఎస్, డీజీపీలతో మాట్లాడిన రైల్వే జీఎం గుప్తా
సాక్షి, హైదరాబాద్‌ః తూర్పుగోదావరి జిల్లా తునిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ దహనమైన ఘటనలో దక్షిణ మధ్య రైల్వే ఒక్కసారిగా అప్రమత్తమైంది. ఆదివారం రాత్రి రైల్వే జీఎం గుప్తా అత్యవసర సమావేశం నిర్వహించి విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే రైళ్లన్నీ నిలిపేయాలని ఆదేశాలిచ్చారు.
ప్రయాణీకులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. విజయవాడ, విశాఖలలో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ సీఎస్ టక్కర్, డీజీపీ రాముడుతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.