ఏపీ జెన్‌కోలో ఆడిటింగ్ బృందం
ఏపీ జెన్‌కోలో ఆడిటింగ్ బృందం
Published Wed, Oct 5 2016 1:40 AM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
ముత్తుకూరు:
టీఈసీ విద్యాసాగర్ అంతర్జాతీయ భద్రతా ఆడిట్ నిపుణులు మంగళవారం నేలటూరులోని ఏపీజెన్‌కో ప్రాజెక్టులోని పలు కీలక విభాగాలను తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలు సమీక్షించారు. భద్రతా ఆడిటర్లు జీ సాయినా«ద్, లక్ష్మీనారాయణ్ నాయక్, ప్రియభారత్ మహంతీ, జ్యోతిప్రియ, మహేంద్ర తదితరులు ప్రాజెక్టులోని బొగ్గు సంభాళింపు, బూడిద, రసాయనిక, పరికరాల నియంత్రణ తదితర విభాగాలను నిశితంగా పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వాహకులు చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, తీసుకొన్న చర్యలను సమీక్షించారు.ఆక్యుపేషనల్ హెల్త్ సెంటర్‌ను పరిశీలించి, ప్రాజెక్టు ఇంజనీర్లు పలు సూచనలు అందచేశారు. భద్రతా అధికారి శేషాద్రిశేఖర్, ఎస్‌ఈ దేవప్రసాద్, సంక్షేమ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు వీరి వెంట పర్యటించారు. ప్రాజెక్టులో పరిశీలించిన అంశాలను ఆడిటర్లు ఒక నివేదిక రూపంలో డైరెక్టర్ ఆఫ్ ప్యాక్టరీస్‌కి అందచేస్తారని జెన్‌కో ఇంజనీర్లు తెలిపారు.
04ఎస్సార్పీ26: జెన్‌కో ప్రాజెక్టులో ఆడిటింగ్ బృందం పర్యటిస్తున్న దృశ్యం
Advertisement
Advertisement