ఏపీజెన్‌కోలో కాలిన ట్రాన్స్‌ఫార్మర్లు
-
ఒకే కన్వేయర్ నుంచి బొగ్గు రవాణా
-
ట్రయల్ రన్ దశలో అవాంతరాలు
ముత్తుకూరు:
కృష్ణపట్నంపోర్టు నుంచి నేలటూరులోని ఏపీజెన్‌కో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌కు బొగ్గు రవాణా చేసే కన్వేయర్ బెల్టు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. దీనితో బొగ్గు రవాణా భారమంతా ఒక్క కన్వేయర్‌పై పడడంతో దీనికి తరచూ అంతరాయం ఏర్పడుతోంది. పోర్టు నుంచి బొగ్గును ఇటీవల వరకు టిప్పర్ల ద్వారా రవాణా జరిపారు. బొగ్గు తరలింపునకు రెండు కన్వేయర్ల నిర్మాణం పూర్తయితే, ట్రయల్ రన్ ప్రారంభించారు. ఒక్కొక్క కన్వేయర్ నుంచి గంటకు 1,300 టన్నుల బొగ్గు రవాణా జరుగుతుంది. ఈ విధంగా ప్రాజెక్ట్‌కు ఒక రోజుకు 15,000 టన్నుల బొగ్గు రవాణా జరగాలి. ఒక్కొక్క కన్వేయర్ బెల్టు మోటారు పనిచేసేందుకు రెండు ట్రాన్స్‌ఫార్మర్లు పనిచేయాలి. గుజరాత్ నుంచి తెచ్చిన వీటితో కన్వేయర్లను ట్రయల్‌రన్ జరుపుతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం ఒక కన్వేయర్‌కు సంబంధించి రెండు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. డిజైన్లలో లోపం వల్ల ఇవి కాలిపోయినట్టు నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండో కన్వేయర్‌పై రవాణా ఒత్తిడి పెరగడంతో తరచూ సాంకేతిక లోపం ఏర్పడి, రవాణా నిలిచిపోతోంది. ఫలితంగా ప్రాజెక్టలో అవసరమైన మేరకు బొగ్గు నిల్వ చేయలేకపోతున్నారు.
ఈ నెల 22 నాటికి ట్రాన్స్‌ఫార్మర్లు రాక:
కాలిపోయిన కన్వేయర్ ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త వాటిని అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్టు జెన్‌కో ఎస్‌ఈ దేవప్రసాద్ తెలిపారు. డిజైన్లలో మార్పు చేసి ఇప్పటికే ఒక ట్రాన్స్‌ఫార్మర్ రప్పించామన్నారు. రెండవది ఈ నెల 22వ తేదీనాటికి చేరుతుందన్నారు. వీటిని అమర్చడం పూర్తిచేసి, 25 తేదీకల్లా బొగ్గు రవాణా ప్రారంభిస్తామన్నారు. ట్రయల్ రన్ దశలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు బిల్లుల చెల్లింపులు ఉండవన్నారు.