- ఏపీ జెన్‌కో ప్రాజెక్టులో విషాదం
బాయిలర్‌పై నుంచి పడి కార్మికుడి మృతి
Published Thu, Jul 21 2016 7:56 PM | Last Updated on Thu, Mar 28 2019 5:32 PM
ముత్తుకూరు: నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్‌కో ప్రాజెక్టులో 1వ యూనిట్ బాయిలర్‌పై నుంచి గురువారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు కింద పడి మృతి చెందాడు. ఇంజనీర్ల కథనం ప్రకారం..1వ యూనిట్‌లో ఇటీవల ఓవర్ ఆయిలింగ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బాయిలర్‌లోని ప్రైమరీ ఏర్ డస్ట్ వద్ద బ్రదర్స్ సంస్థ తరపున పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన బోనా రామదాసు(24) వెల్డింగ్ పనులు చేసేందుకు సిద్ధమవుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామదాసు అక్కడికక్కడే చనిపోయాడు. ఇటీవల మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు బాయిలర్‌పై నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ప్రాజెక్టులోని నాగాలమ్మ గుడిలో ఇటీవల అధికారులు పూజలు చేశారు. వరుస ప్రమాదాలతో జెన్‌కో ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు.
Advertisement
Advertisement