worker death
-
ప్రాణం తీసిన ఫేస్బుక్ పోస్ట్
ముంబై : ఫేస్బుక్ పోస్ట్ ప్రాణం తీసింది. వివరాలు.. ముంబైకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త మనోజ్ దుబే(45) అనే వ్యక్తిపై ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి చంపేశారు. దుబే తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఓ పొలిటికల్ పోస్ట్ ఈ దాడికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తుల గురించి పూర్తి సమాచారం తెలియలేదు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుబే మృతి పట్ల మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యకర్తలు సంతాపం తెలిపారు. బీజేపీ కార్యకర్తలే ఈ దాడి చేశారంటూ ఆరోపించారు. Shocking! Manoj Dubey, a staunch Congress worker was murdered for his facebook post by BJP goons. We strongly condemn such a coward act! The culprits should be brought to justice. Our deepest condolences to his family, Congress party stands with his family at this hour of grief. pic.twitter.com/BcVhzZdtD0 — Maharashtra Congress (@INCMaharashtra) October 22, 2018 -
మనిషి ప్రాణానికి విలువేది..!
► ప్రమాదంపై స్పందించని యాజమాన్యం ► మృతదేహంతో ఎన్టీపీసీ గేట్ వద్ద నిరసన జ్యోతినగర్: ముప్పై ఏళ్లకుపైగా సంస్థలో పనిచేస్తున్న ఓ కార్మికుడు విధినిర్వహణలో జరిగిన ప్రమాదంలో మరణిస్తే యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఎన్టీపీసీ రామగుండం సంస్థలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న తోపుచెర్ల సంపత్రావు(55) మంగళవారం ఉదయం విధి నిర్వహణలో గాయపడ్డాడు. తోటి కార్మికులు పీటీఎస్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలిస్తుండగానే చనిపోయాడు. మంగళవారం సాయంత్రం మృతదేహాన్ని ప్రాజెక్టు గేట్ వద్ద ఉంచి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. బుధవారం సాయంత్రం కావస్తున్నా ఆకుటుంబానికి నష్టపరిహారం చెల్లింపులో జాప్యం చేయడంపై కార్మికులు యాజమాన్య వైఖరిపై మండిపడుతున్నారు. గేట్ వద్ద ఉంచిన మృతదేహం వద్ద కుటుంబసభ్యులు రోధించినా యాజమాన్యానికి కనిపించడం లేదా అని తోటి కార్మికులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు కార్మికుని ప్రాణానికి భద్రత కరువైందనడానికి ఇదే నిదర్శనమని యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ వారి ప్రాణాల భద్రతకు మాత్రం సంబంధిత యాజమాన్యం ఎలాంటి రక్షణ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమాలు ఫలించకపోవడంతోనే కార్మికుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ప్రాణాలను కాపాడడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపణలు ఉత్పన్నమవుతున్నాయి. కార్మికులు విధులు సైతం బహిష్కరించి నిరసన చేస్తున్నప్పటికి చలనం లేకపోవడంతో గేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్టీపీసీ సంస్థలోని కాంట్రాక్టు కార్మికుల భద్రతపై అన్ని యూనియన్లు కలిసికట్టుగా ఉద్యమం చేసి వారి హక్కులు సాధిస్తేనే జీవన మనుగడకు అర్థం ఉంటుందని కార్మికులు పేర్కొంటున్నారు. -
బాయిలర్పై నుంచి పడి కార్మికుడి మృతి
ఏపీ జెన్కో ప్రాజెక్టులో విషాదం ముత్తుకూరు: నేలటూరులోని దామోదరం సంజీవయ్య ఏపీ జెన్కో ప్రాజెక్టులో 1వ యూనిట్ బాయిలర్పై నుంచి గురువారం ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు కింద పడి మృతి చెందాడు. ఇంజనీర్ల కథనం ప్రకారం..1వ యూనిట్లో ఇటీవల ఓవర్ ఆయిలింగ్ పనులు చేపట్టారు. ఇందులో భాగంగా బాయిలర్లోని ప్రైమరీ ఏర్ డస్ట్ వద్ద బ్రదర్స్ సంస్థ తరపున పనులు జరుగుతున్నాయి. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన బోనా రామదాసు(24) వెల్డింగ్ పనులు చేసేందుకు సిద్ధమవుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రామదాసు అక్కడికక్కడే చనిపోయాడు. ఇటీవల మాదరాజుగూడూరుకు చెందిన కళ్యాణ్ అనే యువకుడు బాయిలర్పై నుంచి పడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని ప్రాజెక్టులోని నాగాలమ్మ గుడిలో ఇటీవల అధికారులు పూజలు చేశారు. వరుస ప్రమాదాలతో జెన్కో ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు.